Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నారా లోకేశ్‌కు ఉప ముఖ్యమంత్రి పదవి! : క్లారిటీ ఇచ్చిన టీడీపీ

Advertiesment
tdp flag

ఠాగూర్

, సోమవారం, 20 జనవరి 2025 (17:11 IST)
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ విద్యాశాఖామంత్రి నారా లోకేశ్‌కు ఉప ముఖ్యమంత్రి పదవికి ఇవ్వాలన్న డిమాండ్లు నానాటికీ పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీ కీలక ఆదేశాలు జారీచేసింది. నారా లోకేశ్‌కు డిప్యూటీ సీఎం అంశంపై ఎవరూ మాట్లాడొద్దని ఆ పార్టీ కార్యకర్తలకు స్పష్టం చేసింది. ఈ అంశంపై ఎవరూ కూడా మీడియా వద్ద బహిరంగ ప్రకటనలు చేయొద్దని సూచించింది. ఏ నిర్ణయమైనా కూటమి నేతలు కూర్చొని మాట్లాడుకుంటారని, అందువల్ల వ్యక్తిగత అభిప్రాయాలను పార్టీపై రుద్దవద్దని పేర్కొంది. 
 
కాగా, ఇటీవల సీఎం చంద్రబాబు నాయుడు కడప జిల్లా మైదుకూరు పర్యటన సమయంలో కడప జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, నారా లోకేశ్‌కు ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని తన అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. ఆ తర్వాత పలువురు నేతలు ఇదే అంశంపై బహిరంగంగా మాట్లాడారు. పార్టీతో సంబంధం లేకపోయినప్పటికీ ఎవరి వ్యక్తిగత అభిప్రాయాలను వారు చెబుతున్నారు. 
 
అలాగే, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ, రాజమండ్రి అర్బన్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసుతో పాటు మరికొందరు నారా లోకేశ్‌ను డిప్యూటీ సీఎం చేయాలంటూ బహిరంగంగా వ్యాఖ్యానించిన విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో ఎవరి వ్యక్తిగత అభిప్రాయాలు వారు చెప్పడం సరికాదని పార్టీ అధిష్టానం భావించింది. ఇలాంటి సున్నితమైన అంశాలపై కూటమి నేతలు చర్చించి నిర్ణయం తీసుకుంటారని స్పష్టతనిస్తూ, ఇకపై ఈ అంశంపై ఎవరూ మాట్లాడొద్దని నేతలకు ఆదేశాలు జారీచేసింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జగన్ బెయిల్ రద్దు పిటిషన్‌పై ట్విస్ట్... ఏం జరిగిందంటే..?