Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

టిడిపి జోరు, వైసిపి బేజారు..?

టిడిపి జోరు, వైసిపి బేజారు..?
, మంగళవారం, 7 డిశెంబరు 2021 (13:26 IST)
తెలుగుదేశం పార్టీ అనూహ్యంగా పుంజుకుంటోందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ప్రభుత్వంపై కాస్తంత వ్యతిరేకత వుందనీ, ప్రజా పోరాటాలతో ప్రస్తుతం ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ నాయకులు అదే ఆయుధంగా ముందుకు సాగుతున్నారట. దీంతో ప్రజలకు దగ్గరవుతున్నారన్న సంకేతాలు ఉన్నాయట. 

 
తాజాగా వైసిపి నుంచి టిడిపిలో చేరికలే ఇందుకు ఉదాహరణగా చెప్పుకుంటున్నారు. తెలుగుదేశం పార్టీపై నమ్మకంతోను, అలాగే ప్రజా సమస్యలపై అలుపెరగని పోరాటం చేస్తుండటంతోనే ఆ పార్టీపై నమ్మకంతో చేరికలు పెరిగిపోతున్నాయట.

 
ఇటీవల జరిగిన పరిషత్ ఎన్నికల్లో టిడిపికి అనుకూలంగా పలుచోట్ల ఫలితాలు వచ్చాయి. దీంతో పార్టీ పుంజుకున్నట్లు పరిస్థితి కనిపిస్తోందంటున్నారు విశ్లేషకులు. అంతేకాకుండా చాలా చోట్ల ఎంపిటీసీ, జెడ్పీటీసీ ఎన్నిలకు సంబంధించి టిడిపి కొన్నిస్థానాలను కైవసం చేసుకోవడం.. అలాగే పలు ప్రాంతాల్లో గట్టి పోటీ ఇవ్వడం కూడా జరిగాయట.
 
రాష్ట్రంలోని ప్రధాన ప్రాంతాలైన కర్నూలు జిల్లా కోవెలకుంట్ల మండలంలోని సౌదారగిన్నె గ్రామానికి చెందిన 150 వైసిపి కుటుంబాలు బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే బిసి జనార్థన్ రెడ్డి టిడిపిలో చేరడం.. అలాగే అనంతపురం జిల్లాలో మున్సిపల్ మాజీ ఛైర్మన్ జె.సి.ప్రభాకర్ రెడ్డి సమక్షంలో 100 మంది వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరడం లాంటివి జరిగాయి.
 
అంతేకాకుండా పశ్చిమగోదావరి, పాలకొల్లు, తూర్పుగోదావరి జిల్లాల్లోను ఇదేవిధంగా చాలామంది వైసిపి నుంచి టిడిపిలో చేరడంతో పార్టీపై నమ్మకంతో ఇదంతా జరుగుతోందని.. ఇలాగే పోరాటం చేస్తే టిడిపిపై ప్రజల్లో మరింత నమ్మకం పెరిగే అవకాశం ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భద్రాద్రి రాముడికి బంగారు కిరీటాన్ని కానుకగా ఇచ్చిన ఏపీ మంత్రి!