Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

చినబాబుపై చిర్రుబుర్రుమంటున్న టీజీ ఫ్యామిలీ... వేరే పార్టీలోకి జంప్?

ఏపీ మంత్రి నారా లోకేష్‌ తీరుపై టీజీ ఫ్యామిలీ మండిపడుతోందట. పార్టీలో వున్న వారిని కాదని ఫిరాయింపు నేతలకు చినబాబు పెద్ద పీట వేయడంపై టీటీపీలో రచ్చ జరుగుతోంది. చినబాబు తీరు నచ్చకపోయినా టీజీ ఫ్యామిలీ బయటిక

చినబాబుపై చిర్రుబుర్రుమంటున్న టీజీ ఫ్యామిలీ... వేరే పార్టీలోకి జంప్?
, గురువారం, 12 జులై 2018 (17:50 IST)
ఏపీ మంత్రి నారా లోకేష్‌ తీరుపై టీజీ ఫ్యామిలీ మండిపడుతోందట. పార్టీలో వున్న వారిని కాదని ఫిరాయింపు నేతలకు చినబాబు పెద్ద పీట వేయడంపై టీటీపీలో రచ్చ జరుగుతోంది. చినబాబు తీరు నచ్చకపోయినా టీజీ ఫ్యామిలీ బయటికి కనబడకపోయినా.. లోలోపల మాత్రం మండిపడుతున్నారని టాక్. ఒకప్పుడు తెలుగు దేశానికి కంచుకోటగా ఉన్న కర్నూలు జిల్లాకు పూర్వవైభవం తేవాలన్న లోకేష్ తపన వివాదానికి దారితీసింది. 
 
లోకేష్ అనూహ్యంగా చేసిన ఈ ప్రకటన స్థానిక నేతల మధ్య చిచ్చు పెట్టింది. ఇటీవల కర్నూలు పర్యటనకు వెళ్లిన లోకేష్ అక్కడ ఏకంగా అభ్యర్ధులను ప్రకటించేశారు. లోకేష్ ప్రకటనతో వలస నేతలకు పెద్ద పీట వేస్తూ పార్టీ నేతలను పక్కన పెడుతున్నారన్న ఆగ్రహం నష్టపోతున్న నేతల్లో వ్యక్తమవుతోంది. 
 
ఏపీ విభజన సమయంలో కాంగ్రెస్‌పై కోపంతో టి.జి.వెంకటేష్ టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. సహజంగా వాణిజ్యవేత్త, అనేక సేవా కార్యక్రమాలు కూడా ఉండటంతో టిజి వెంకటేష్ పార్టీ మార్పుపై స్థానికంగా పెద్ద వ్యతిరేకత వ్యక్తం కాలేదు. అప్పటినుంచి టీడీపీ లోనే ఉంటున్న టిజి తన వారసత్వ రాజకీయాలకు బాటలు వేసుకుంటూ వచ్చారు. 
 
జిల్లాలో తనకంటూ ఓ మార్క్ చాటుకున్న టీజీ ఇప్పుడు తన కుమారుడి భవిష్యత్తే ధ్యేయంగా పావులు కదుపుతున్నారు. తండ్రి అడుగు జాడల్లో నడుస్తూ అటు భరత్ కూడా కర్నూలు అసెంబ్లీ స్థానానికి పోటీ చేసి తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకున్నారు. కానీ నారాలోకేషన్ ప్రస్తుతం అభ్యర్థులను ప్రకటించేయడంపై టీజీ కుటుంబీకులు గుర్రుగా వున్నారని.. దీంతో వేరే పార్టీ మారాలనే ఉద్దేశంతో వున్నట్లు తెలుస్తోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మరో రెండు రోజుల్లో శ్రీరెడ్డికి అదేగతి.. ఏంటది?