Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఊరికొక ఆంబోతులా తయారవుతున్నారు : గోరంట్లపై చంద్రబాబు ఫైర్

Advertiesment
chandrababu
, బుధవారం, 10 ఆగస్టు 2022 (11:54 IST)
వైకాపా హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్‌ నగ్న వీడియో అంశంపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సిగ్గులేకుండా వెధవ పని చేసి... సమర్థించుకుంటున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైకాపా నేతలు ఊరికొక ఆంబోతులా తయారవుతున్నారని, ఈ ఆంబోతులు బట్టలిప్పేసి తిరుగుతుంటే మనం చూస్తుండాలా? అని ఆయన ప్రశ్నించారు. 
 
తన నాలుగు దశాబ్దాల రాజకీయ చరిత్రలో ఇలాంటి సన్నివేశాలను, ఇలాంటి వెధవలను చూడలేదన్నారు. సిగ్గు, శరం, మానం మర్యాదలు ఉంటే... ఇలా సిగ్గులేకుండా మళ్లీ బయటతిరగరన్నారు. ఇటీవలి కాలంలో చాలా మంది సిగ్గులేని వారు రాజకీయాల్లోకి వస్తున్నారని, ఇలాంటి వాళ్లే మతం, కులం, ప్రాంతం అంటూ రాజకీయాలు చేస్తుంటారనీ, చేసిన తప్పును కప్పిపుచ్చుకునేందుకు బరితెగించి మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు. 
 
ఇలాంటి పాడు పనులు చేసేవారిని కాపాడేందుకు మరో సిగ్గులేని ముఖ్యమంత్రి ఉన్నారన్నారు. పార్టీకి అధ్యక్షుడుగా ఉన్న వ్యక్తి పార్టీలో వాళ్లు తప్పు చేస్తే శిక్షించాలి. పిలిచి సరిచేయాలి. అవసరమైతే ఒకరిద్దరిని డిస్మిస్ చేయాలి. దాంతో మిగతావాళ్లకు భయం ఉంటుంది. కానీ ఇలాంటివి చేయకపోవడం వల్ల ఎక్కడికక్కడ కీచకులు తయారయ్యారు. 
 
భయం లేకుండా, ఇష్టానుసారం ఆడబిడ్డలపై పడే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే వాళ్లకో ధైర్యం వచ్చింది... మా ముఖ్యమంత్రి ఏమీ అడగడన్న భరోసాతో రెచ్చిపోతున్నారు. మేం ఆంబోతుల మాదిరిగా తిరుగుతాం అంటున్నారు. ఇలాంటి ఆంబోతులను కట్టడి చేసే శక్తి టీడీపీకి ఉంది. ఇలాంటివాళ్లను వదిలిపెట్టేది లేదు. ఊళ్ల మీదపడి దౌర్జన్యాలు, కబ్జాలు, అత్యాచారాలు చేస్తారా? కేసులు పెడతారా? అంటూ చంద్రబాబు మండిపడుతూ ఓ వీడియోను రిలీజ్ చేశారు. 

 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నేపాల్‌లో పెరుగుతున్న కరోనా కేసులు.. భారత టూరిస్టులపై నిషేధం