Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సార్ మేమంతా ఓట్లేశాం, ఆ ఓట్లు ఏమైపోయాయి... మీ ప్రశ్నకు ఆన్సర్ లేదు తమ్ముడు

Advertiesment
సార్ మేమంతా ఓట్లేశాం, ఆ ఓట్లు ఏమైపోయాయి... మీ ప్రశ్నకు ఆన్సర్ లేదు తమ్ముడు
, మంగళవారం, 9 జులై 2019 (19:51 IST)
సార్.. గత ఎన్నికల్లో తామంతా తెలుగుదేశం పార్టీకే ఓటు వేశాం.. ఆ ఓట్లన్నీ ఏమైపోయాయి అంటూ అనేక మంది టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును ప్రశ్నిస్తున్నారు. దీనికి ఆయన చెప్పే సమాధానం ఒక్కటే. మీ ప్రశ్నకు నా వద్ద సమాధానం లేదు తమ్ముడు అంటున్నారు. 
 
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అనంతపురం జిల్లాలో పర్యటిస్తున్నారు. వైసీపీ నేతలు, కార్యకర్తల దాడులకు గురైన తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో మనోధైర్యం నింపేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో తాడిపత్రిలో హత్యకు గురైన కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించి, పార్టీ అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు
 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, "మీ గ్రామంలో మీరు ఏకాకి కాదు. తెలుగుదేశం పార్టీ మీకు అండగా ఉంటుంది. మనది ఒక్క గ్రామానికే పరిమితమైన పార్టీ కాదు, రాష్ట్రం అంతటా ఉంటుంది. మీరు ఆత్మస్థయిర్యంతో ఉండాలి. ఎక్కడికి వెళ్లినా ఒక్కటే అడుగుతున్నారు, సార్ మేమంతా ఓట్లేశాం, ఆ ఓట్లు ఏమైపోయాయి అంటున్నారు. 
 
ఈ ప్రశ్నకు నా దగ్గర కూడా సమాధానం లేదు తమ్ముళ్లూ! దాడులు చేయడం తప్పు అన్న వాళ్లపైనా తప్పుడు కేసులు పెడుతున్నారు. ఇదేమన్నా రౌడీరాజ్యం అనుకుంటున్నారా? ఇది ప్రజాస్వామ్యం కాదా? ఏమనుకుంటున్నారు మీరు? ప్రాణం పోయినా ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటాం" అంటూ చంద్రబాబు ఆవేశపూరితంగా ప్రసంగించారు.
 
అంతేకాకుండా, వైకాపా దాడుల నుంచి తమ పార్టీకి కార్యకర్తలను కాపాడుకునేందుకు ఎలాంటి పోరాటానికైనా తాను సిద్ధమని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. ఆయన మంగళవారం కడప జిల్లా 
 
విమానాశ్రయంలో విలేకరులతో మాట్లాడుతూ, 
కార్యకర్తలను కాపాడు కోవడానికి ఎలాంటి పోరాటానికైనా సిద్ధమేనని ప్రకటించారు. 
 
వైసీపీ నేతలు చేస్తున్న దాడులను ఖండిస్తున్నట్టు చెప్పారు. 
 
దాడులకు నిరసన వ్యక్తం చేస్తున్నానని తెలిపారు. 
 
ఏ కార్యకర్తకు అన్యాయం జరిగినా సహించేది లేదన్నారు. 
 
టీడీపీకి సహాకరించిన ప్రజలపై కూడా వైసీపీ నేతలు, కార్యకర్తలు దాడులు చేస్తున్నారని ఆరోపించారు.
 
చివరకు మీడియాపై కూడా దాడులకు దిగి పత్రికా స్వేచ్ఛను హారిస్తున్నారని మండిపడ్డారు. 
 
ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని, ఎన్నికల్లో గెలుపోటములు సహజమన్నారు. 
 
దాడులు చేయడం మంచి పద్ధతి కాదని వైకాపా నేతలను చంద్రబాబు హెచ్చరించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

#BottleCapChallenge: ఈ వైరల్ బాటిల్ క్యాప్ చాలెంజ్ ఏంటి? ఎందుకు?