Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

విద్యార్థిని నేలకేసి కొట్టిన టీచర్.. కోమాలోకి జారుకున్నాడు..

విద్యార్థిని నేలకేసి కొట్టిన టీచర్.. కోమాలోకి జారుకున్నాడు..
, మంగళవారం, 15 ఫిబ్రవరి 2022 (19:45 IST)
ఓ టీచర్ విద్యార్థిపై ప్రతాపం చూపాడు. గొడ్డును బాదినట్లు బాదడంతో ఆ బాలుడు కాస్త కోమాలోకి వెళ్లాడు. ప్రస్తుతం తిరుపతి స్విమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. 
 
టీచర్‌ను స్కూల్ యాజమాన్యం సస్పెండ్ చేసింది. ఈ ఘటనపై విద్యాశాఖ అధికారుల విచారణ చేపట్టారు. ఈ ఘటన చిత్తూరు జిల్లా, పలమనేరులో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. బాలుడి పేరు రోహిత్. 8వ తరగతి చదువుతున్నాడు. జ్వరంతో బాధపడుతూ స్కూల్‌కి వెళ్లాడు. కాగా, లెక్కల మాస్టర్ జ్యోతీశ్వర్ రోహిత్‌పై చేయి చేసుకున్నాడు. 
 
రోహిత్ తలను బల్లకేసి కొట్టినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత రెండు రోజులకు రోహిత్ తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. మాటలు రాక ఇబ్బందులు పడ్డాడు.
 
రోహిత్ పరిస్థితి చూసి తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. వెంటనే రోహిత్‌ని తిరుపతికి తీసుకెళ్లారు. స్విమ్స్ ఆసుపత్రిలో రోహిత్‌కు చిక్సిత్స అందిస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చిన్నారుల ఆకలి తీర్చేందుకు ఎల‌న్ మ‌స్క్ భారీ విరాళం..!