ఇజ్రాయెల్‌లో హమాస్ ఉగ్రవాదులు విధ్వంసం సృష్టించారు. సామాన్యులను.. ఉగ్రవాదులు చంపిన విధానం కంటతడి పెట్టించే విధంగా ఉంది. ఆ తర్వాత ఇజ్రాయెల్ కూడా తన సైన్యంపై విరుచుకుపడింది. తాజాగా ఓ అమానవీయ ఘటన చోటుచేసుకుంది.
ఓ ఇంట్లోకి చొరబడిన కొందరు.. ఓ గర్భవతి కడుపును చీల్చి, బిడ్డను బయటకు తీసి మరీ చంపేశారు. ఈ కిరాతక చర్యపై ప్రపంచం నివ్వెరపోయింది. గత శనివారం నుంచి ఓ వైపు రాకెట్ల దాడి జరుగుతుంటే.. మరోవైపు హమాస్ ఉగ్రవాదులు.. సరిహద్దులను దాటుకొచ్చి, ఇజ్రాయెల్వాసులకు నరకం చూపించారు. వీధుల్లో ఎవరు కనిపిస్తే వారిని చంపుకుంటూ వెళ్లారు. అనేకమందిని కిడ్నాప్ చేసి, హత్య చేశారు.
యొస్సీ లాండౌ బృందం బీరి అనే ప్రాంతానికి వెళ్లింది. గాజా నుంచి ఐదు కి.మీల దూరంలో ఉండే ఆ ప్రాంతంలో 1,200 మంది నివాసముండేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు.
ఈ బృందం ఓ ఇంట్లోకి వెళ్లారు. ఆ ఇంట్లో ఓ గర్భవతి మృతదేహం పడి ఉంది. ఆమె కడుపును సగం చీల్చేశారు. కడుపులో ఉన్న శిశువును కత్తితో పొడిచి చంపేశారని యొస్సీ లాండౌ వివరించారు. ఆ ఘటన కన్నీళ్లు తెప్పించాయి.