Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ అధ్యక్షులుగా శ్రీనాధ్ దేవిరెడ్డి

ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ అధ్యక్షులుగా శ్రీనాధ్ దేవిరెడ్డి
, శనివారం, 9 నవంబరు 2019 (06:53 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రెస్ అకాడమీ అధ్యక్షులుగా సీనియర్ పాత్రికేయులు శ్రీనాధ్ దేవిరెడ్డి నియమితులయ్యారు. ఈమేరకు శుక్రవారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సాధారణ పరిపాలన శాఖ(ఐ అండ్ పిఆర్)సమాచార పౌరసంబంధాల శాఖ ఎక్స్ అఫీషియో ప్రత్యేక కార్యదర్శి టి.విజయకుమార్ రెడ్డి జిఓఆర్టి 2515 ద్వారా ఉత్తర్వులు జారీ చేశారు.
 
ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కో–ఆర్డినేటర్గా డాక్టర్ కుమార్ అన్నవరపు
అమెరికాలోని అట్లాంటాకు చెందిన ప్రముఖ విద్యావేత్త డాక్టర్ కుమార్ అన్నవరపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కో–ఆర్డినేటర్గా నియమితులయ్యారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం  ఉత్తర్వులు  జారీ చేసింది.

గతంలో ‘విద్య’ ఉద్యోగ విజయాల పక్ష పత్రికను నిర్వహించిన డాక్టర్ కుమార్ అన్నవరపు.. తెలుగు రాష్ట్రాల ప్రజలకు సుపరిచితులు. అమెరికా సంయుక్త రాష్ట్రాల్లోని సుమారు  100 కు పైగా  ప్రసిద్ధ విశ్వవిద్యాలయాలను స్వయంగా సందర్శించడం ద్వారా, వాటిలో మన తెలుగు విద్యార్థుల ఉన్నత విద్యాభ్యాసానికి ఉన్న అవకాశాలపై వివిధ ప్రసార మాధ్యమాల ద్వారా విస్తృత ప్రచారం నిర్వహించడం ద్వారా ఎందరో విద్యార్థులకు విదేశీ విద్యపై అవగాహన కలిగించారు.

ఆయన సేవలను గుర్తించి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆయనను ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కోఆర్డినేటర్గా నియమించడం జరిగింది. ఏపీలోని కృష్ణా జిల్లా నందిగామ డాక్టర్ కుమార్ అన్నవరపు స్వస్థలం.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భవన నిర్మాణ కార్మికుల కోసం జనసేన ఆహార శిబిరాలు