Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఏపీలో శ్రీరామచంద్రుడు కూడా బాధితుడే: జేఏసీ

ఏపీలో శ్రీరామచంద్రుడు కూడా బాధితుడే: జేఏసీ
, సోమవారం, 4 జనవరి 2021 (12:08 IST)
ఆంధ్రప్రదేశ్ లో కొనసాగుతున్న రెండేళ్ల జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో శ్రీరామచంద్రుడు కూడా బాధితుడు అయ్యాడని అమరావతి బహుజన జేఏసీ అధ్యక్షుడు పోతులు బాలకోటయ్య అభివర్ణించారు. తుళ్లూరు దీక్షా శిబిరంలో రాజధాని అమరావతి పేరిట 2021 నూతన సంవత్సర క్యాలెండర్  ను పలువురు జేఏసీ నాయకులు, పలు రాజకీయ పార్టీల నాయకులు ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా బాలకోటయ్య మాట్లాడుతూ.. జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో అందరూ బాధితులే అని చెప్పారు. ఇసుక రద్దు కారణంగా భవన నిర్మాణ కార్మికులు, రాజధాని తరలింపు కారణంగా రాజధాని రైతులు, ఇంగ్లీష్ భాష కారణంగా తెలుగు భాష ప్రేమికులు, పత్రికలపై అంక్షల  కారణంగా పాత్రికేయులు, దాడుల కారణంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కులాలవారు ,కేసుల కారణంగా ప్రతిపక్ష పార్టీలు ఇలా అందరూ బాధితులే అని, ఆఖరికి రామతీర్థం లోని శ్రీరామచంద్రుడు కూడా జగన్ మోహన్ రెడ్డి పరిపాలనలో బాధితుడు అయ్యాడని అభివర్ణించారు.

సిపిఎం పార్టీ నాయకులు ముప్పాళ్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ.. రాజధాని తరలింపు ప్రక్రియ చేపట్టి ముఖ్యమంత్రి పెద్ద తప్పు చేశారని, ఈ తప్పుకు గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. అఖిల భారత హిందూ మహాసభ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు వెలగపూడి గోపాలకృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ.. మంత్రి వెల్లంపల్లి నోటికొచ్చినట్టు దూషించటాన్ని  తప్పుబట్టారు. పాలన చేతకాకపోతే కృష్ణానదిలో దూకి చావాలని హితవు పలికారు.

కాంగ్రెస్ పార్టీ నాయకురాలు సుంకర పద్మశ్రీ  మాట్లాడుతూ రాజధాని మహిళా ఉద్యమం చరిత్రలో సువర్ణఘట్టం గా ఉంటుందని ,ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లడం పట్ల మహిళలకు అభినందనలు తెలిపారు .సామాజిక విశ్లేషకులు టి. లక్ష్మీనారాయణ మాట్లాడుతూ అన్ని దారులూ  పులివెందుల  వైపే ఉన్నాయని వ్యాఖ్యానించారు.

రాష్ట్రంలో సాగునీటి పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని తప్పుబట్టారు. అమరావతి రైతుల పట్ల ప్రభుత్వ విధానాలను ఖండించారు .దళిత బహుజన ఫ్రంట్ జాతీయ అధ్యక్షులు మేళం భాగ్య రావు మాట్లాడుతూ అమరావతిలో దళిత బహుజనుల పాత్ర గట్టిగా ఉన్నట్లు గుర్తు చేశారు. ఒక కులం పేరు చెప్పి ముఖ్యమంత్రి బహుజన కులాలకు ద్రోహం చేస్తున్నట్లు ఆరోపించారు.

ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు పేరు పోగు వెంకటేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్రంలో జరుగుతున్న దళితులపై దాడుల పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. దళిత జెఎసి అధ్యక్షులు మార్టిన్ మాట్లాడుతూ దమనకాండ వల్ల ఏ ప్రభుత్వం  బతికి బట్ట కట్ట లేదని హెచ్చరించారు.

అమరావతి రైతు ఐక్య కార్యాచరణ సమితి అధ్యక్షులు సుధాకర్ మాట్లాడుతూ రాజధాని ఉద్యమాన్ని 13 జిల్లాలకు వ్యాపించేలా కార్యాచరణ తీసుకుంటున్నట్టు ప్రకటించారు. దళిత మహిళా జేఏసీ కమల మాట్లాడుతూ రాజధాని ఉద్యమంలో బహుజన మహిళలను చైతన్యవంతం చేస్తున్నట్లు ప్రకటించారు.

అమరావతి పరిరక్షణ సమితి నాయకులు మల్లికార్జున రావు మాట్లాడుతూ అమరావతి ఉద్యమానికి న్యాయం జరిగేదాకా ఉద్యమం కొనసాగుతుందని ప్రకటించారు .వీరితో పాటు పలు రైతు నాయకులు, జేఏసీ నాయకులు సభలో ప్రసంగించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సంక్రాంతికి గన్నవరం-హైదరాబాద్ మధ్య ప్రత్యేక విమాన సర్వీసులు