అల్లుడు అంటే కొడుకుతో సమానం. అలాంటిది వావివరసలు మరిచిపోయిన ఒక మహిళ అల్లుడితో వివాహేతర సంబంధాన్ని పెట్టుకుంది. తన ఇంటిలోనే ఇదంతా సాగించింది. భర్తకు ఏమాత్రం అనుమానం రానివ్వకుండా జాగ్రత్త పడింది. అయితే ఎక్కువ రోజులు దాగదుగా వీరి బాగోతం బయటపడింది. కోపంతో రగిలిపోయిన మామ కాపు కాసి మరీ అల్లుడిని అతి దారుణంగా చంపేశాడు.
అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం వై.రామాపురం వద్ద రెండురోజుల క్రితం ఒక హత్య జరిగింది. హతుడు వన్నూరుస్వామి.. ఇతను కళ్యాణదుర్గం గోళ్ళ గ్రామానికి చెందిన వ్యక్తి. పోలీసులు విచారణలో హతుడి సొంత మామే హంతకుడని తేల్చేశారు. భాస్కర్, రాజమ్మలకు వివాహం జరిగింది. రాజమ్మకు వన్నూరుస్వామి స్వయానా మేనల్లుడు.
మేస్త్రీ పని చేసే వన్నూరుస్వామి మామ ఇంటిలోనే గదిని అద్దెకు తీసుకుని నివశిస్తున్నాడు. కరోనా సమయంలో ఊరు వెళ్ళిపోయిన వన్నూరుస్వామి మళ్ళీ మూడు నెలల క్రితమే వచ్చాడు. మూడునెలల నుంచి వీరి మధ్య వివాహేతర సంబంధం కొనసాగుతోంది.
ఇంట్లోనే వన్నూరుస్వామి ఉండటంతో ఎవరికీ వీరి వివాహేతర సంబంధం తెలియలేదు. అయితే మూడురోజుల క్రితమే ఇంటికి వచ్చిన భాస్కర్ అల్లుడితో భార్యను ఏకాంతంగా చూశాడు. కోపంతో రగిలిపోయాడు. తన భార్యకి వన్నూరుస్వామే మాయమాటలు చెప్పి లొంగదీసుకుని ఉంటాడని నిర్థారించుకున్నాడు.
ఎలాగైనా అతన్ని చంపేయాలని ప్లాన్ చేశాడు. అనుకున్న విధంగా వన్నూరుస్వామి ఒంటరిగా ఊరికి బయట వెళుతుండగా కాపుకాచి కత్తితో నరికి చంపేశాడు. ఆ తరువాత అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని తరలించి విచారణ చేపట్టగా అసలు విషయం బయటపడింది.