Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సిమ్ కార్డు నీటిలో పడేస్తానంటూ ఆటపట్టించాడు.. నీటిలో పడి తిరిగిలోకాలకు వెళ్ళిపోయాడు..

హన్మకొండ పద్మాక్షీ గుండం మెట్లపై హాయిగా కూర్చుని ప్రేమికులు కబుర్లు చెప్పుకుంటున్నారు. ఇంతలో ప్రేమికుడు.. ప్రేయసిని ఆటపట్టించాలనుకున్నాడు. అప్పటికీ చేతిలో ఉన్న ఫోనులో ఉన్న సిమ్ కార్డును తీసేశాడు. చేతి

Advertiesment
sim card death in hanamkonda
, శుక్రవారం, 18 నవంబరు 2016 (11:10 IST)
హన్మకొండ పద్మాక్షీ గుండం మెట్లపై హాయిగా కూర్చుని ప్రేమికులు కబుర్లు చెప్పుకుంటున్నారు. ఇంతలో ప్రేమికుడు.. ప్రేయసిని ఆటపట్టించాలనుకున్నాడు. అప్పటికీ చేతిలో ఉన్న ఫోనులో ఉన్న సిమ్ కార్డును తీసేశాడు. చేతిలో పెట్టుకున్నాడు. నీటిలో పారేస్తానని ఆటపట్టించాడు.

వద్దంటూ ప్రేయసి వారించింది. కానీ అతడు వినలేదు. సిమ్ కార్డును నీళ్లలో పడేస్తానంటూ.. నీళ్లలో పడేస్తానంటూ దిగుతుండగానే ప్రమాదం అతనిని ఆవహించింది. కాలు జారి గుండంలో పడిపోయాడు. ఈత కూడా రాకపోవడంతో నీటిలో మునిగి చనిపోయాడు ఈ ఘటన.. హన్మకొండ పద్మాక్షీ గుండం వద్ద చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. వరంగల్‌ అర్బన్‌ జిల్లా నారాయణగిరికి చెందిన కల్పనకు మహబూబాబాద్‌ జిల్లా గార్లకు చెందిన ఇందర్‌సింగ్‌కు ఫేస్‌ బుక్‌ పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్త ప్రేమకు దారితీసింది. డిగ్రీ పూర్తి చేసిన ఇందర్‌సింగ్‌కు గత జనవరిలోనే కల్పనతో పరిచయమైంది. ఈ ప్రేమకులు హన్మకొండ పద్మాక్షీ గుండం మెట్లపై కూర్చుని, ప్రేమ కబుర్లు చెప్పుకుంటుండగా ఈ దుర్ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నగదు నిల్వలు నిండుకున్నాయ్.. 24 వరకు ఏటీఎంలు క్లోజ్..?