Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సంగం డెయిరి రికార్డు... రోజుకు 6 లక్షల లీటర్ల పాల సేకరణ

Advertiesment
సంగం డెయిరి రికార్డు... రోజుకు 6 లక్షల లీటర్ల పాల సేకరణ
విజ‌య‌వాడ‌ , శుక్రవారం, 7 జనవరి 2022 (12:44 IST)
ప్ర‌భుత్వం నుంచి ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా, సంగం డెయిరీ త‌న రికార్డును నెల‌కొల్పింది. సంగం డెయిరి వ్యవస్థాపకుల ఆలోచనలు, ఆకాంక్షలు నెరవేరుస్తూ దిగ్విజయంగా 6 లక్షల లీటర్ల పాల సేకరణ పూర్తి చేసింది. భవిష్యత్తులో 12 లక్షల లీటర్ల పాల సేకరణ, మార్కెటింగ్ లక్ష్యంగా ముందుకు సాగుతుందని సంగం డెయిరి ఛైర్మన్  ధూళిపాళ్ళ నరేంద్ర కుమార్  అన్నారు. 
 
 
డెయిరి పాల సేకరణ, మార్కెటింగ్ 6.0లక్షల లీటర్ల సామర్ధ్యాన్ని అధిగమించిన సందర్భంగా డెయిరిలోని సమావేశ మందిరంలో ఛైర్మన్ ఆధ్వర్యంలో సీనియర్ అధికారులు, సిబ్బందితో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో  ఛైర్మన్  చేతుల  మీదుగా కేక్ కట్ చేసి, పలువురికి చైర్మన్ అభినందనలు  తెలియజేశారు.    ఈ సందర్భంగా ఛైర్మన్ మాట్లాడుతూ, 1978 లో డెయిరితో పాటు నర్సరావుపేట, గురజాల చిల్లింగ్ సెంటర్లతో లక్ష లీటర్ల పాల సేకరణ సామర్ధ్యంతో  ప్రారంభమైన డెయిరి నేడు 6.0 లక్షల లీటర్లకు చేరుకోవడం కోసం అహర్నిశలు శ్రమించిన డెయిరి అధికారులు, సిబ్బందిని అభినందించారు.  సంగం డెయిరి పాలసేకరణ సామర్ధ్యం 6.06 లక్షల లీటర్లకు చేరుకుందన్నారు. 


2010 లో తాను ఛైర్మన్ గా పదవి భాధ్యతలు చేపట్టే నాటికి లక్ష లీటర్లు  సేకరించిన పాలను మార్కెటింగ్ చేయడానికే కష్టపడవలసిన పరిస్థితులు ఉండేవని అన్నారు.  విపణిలో  పాల సేకరణ, మార్కెటింగ్ లో వస్తున్న మార్పులకు అనుగుణంగా ముందు చూపుతో నూతన విధానాలు అమలు చేశామని ఫలితంగా 2 చిల్లింగ్ సెంటర్ల నుండి నేడు 34 చిల్లింగ్ / మిల్క్ కూలర్లు ఏర్పాటు చేయుట జరిగిందన్నారు. గతంలో గుంటూరు జిల్లాకు పరిమితమైన మార్కెటింగ్ ను హైదరాబాద్, విజయవాడ, బెంగుళూరు నగరాల‌తోపాటు, 8 జిల్లాలలో తమ ఉత్పత్తులను మార్కెటింగ్ చేస్తున్నామన్నారు. 
 
 
ఉత్పత్తుల నాణ్యతలో రాజీ లేకుండా వస్తున్న టెక్నాలజీని అంది పుచ్చుకొని ముందుకు సాగుట వలన సంగండెయిరిదక్షిణ భారతదేశములోనే పేరెన్నికగన్న డెయిరిగా రూపాంతరం చెందిందని చెప్పారు. నేడు 6 లక్షల లీటర్ల సామర్ధ్యమును పూర్తి చేసినప్పటికీ భవిష్యత్తులో పాల సేకరణ 12 లక్షల లీటర్లకు పెంచాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని అన్నారు. భవిష్యత్తు అవసరాలకు అనుగుణముగా నేడు ప్లాంట్ సామర్యాన్ని 8 లక్షల లీటర్ల పాలను ప్రాసెస్ చేసే సామర్ధ్యానికి  పెంచామని, భవిష్యత్తులో 12 లక్షల లీటర్ల సామర్ధ్యానికి పెంచాలనే లక్ష్యంతో అడుగులు వేస్తున్నామని చెప్పారు. సంగండెయిరి ఉత్పత్తులకు  మార్కెట్ లో అధిక డిమాండ్ ఉందని తెలిపారు. 
 
 
గతంలో గుంటూరు జిల్లాకే పరిమితమైన సంగండెయిరి నేడు ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, అనంతపురం, కృష్ణా,  పశ్చిమ, తూర్పు గోదావరి జిల్లాలలో పాలను సేకరిస్తున్నదని భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 13 జిల్లాలలో పాలను సేకరించాలనే లక్ష్యముగా ముందుకు సాగుతున్నామని తెలిపారు. అదే విధంగా రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో మార్కెటింగ్ విస్తరించాలని,  సమీప  రాష్ట్రాలలోని  ప్రధాన నగరాలైన  చెన్నై, బెంగళూరు, హైదరాబాద్  మార్కెట్ లో అధికశాతం సంగం డెయిరి ఉత్పత్తులు అమ్ముడయ్యేలా చర్యలు చేపట్టాలన్నారు. 
 
 
గత 44 ఏళ్ల డెయిరిలో అనేక మైలురాళ్లను ఆధుగమిస్తూ నేడు దక్షిణ భారతదేశంలోనే పేరెన్నికగన్న డెయిరిగా ఎదిగిందని, భవిష్యత్తులో దేశంలో ప్రముఖ డెయిరిగా పేరు ప్రఖ్యాతలు సాధించే రోజు అతి త్వరలోనే ఉన్నదని అన్నారు. సమావేశానికి ముందుగా డెయిరిలోని ధూళిపాళ్ళ వీరయ్య చౌదరి విగ్రహానికి పులమాలంకరణ చేసి నివాళులు అర్పించారు.   
 
 
ఈ సమావేశంలో మేనేజింగ్ డైరెక్టర్  పి.గోపాలకృష్ణన్, ప్లాంట్ మేనేజర్ యం.బ్రహ్మయ్య,  మార్కెటింగ్  మేనేజర్ ఆర్.శ్రీధర్ బాబు, పి అండ్ ఐ జనరల్ మేనేజర్ కె.వెంకటేశ్వర ప్రసాద్ తోపాటు పలువురు సీనియర్ మేనేజర్లు, పి అండ్ ఐ, మార్కెటింగ్, ఇంజనీరింగ్, ఫైనాన్స్,  క్వాలిటీ కంట్రోల్,  ప్రొడక్షన్  అధికారులు పాల్గొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జమ్మూ-కాశ్మీర్‌లో ఉగ్రవాదుల ఏరివేత: ముగ్గురు హతం