Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సీఎం జ‌గ‌న్ కు పాలాభిషేకం చేసిన ఆర్టీసీ లేడీ కండ‌క్టర్...ఎందుకు?

సీఎం జ‌గ‌న్ కు పాలాభిషేకం చేసిన ఆర్టీసీ లేడీ కండ‌క్టర్...ఎందుకు?
విజ‌య‌వాడ‌ , శనివారం, 28 ఆగస్టు 2021 (17:17 IST)
ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఏపీఎస్ ఆర్టీసీ ఉద్యోగుల కోసం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీఎస్ ఆర్టీసీ కార్మికులంద‌రికీ కార్పొరేట్ బీమా సౌకర్యం కల్పించింది. ఇందుకోసం దేశంలో అతి పెద్ద బ్యాంకు అయిన స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్ ఇండియాతో ఒప్పందం చేసుకుంది. ఇందులో భాగంగా, ఎపుడైనా ప్రమాదవశాత్తు ఉద్యోగి మృతి చెందితే 40 లక్షల బీమా సౌకర్యం కల్పించింది. శాశ్వత వికలాంగులైతే 30 లక్షలు, సహజ మరణానికి 5 లక్షల బీమా వర్తిస్తుంది. 
 
అంతేకాకుండా మరణించిన ఉద్యోగుల పిల్లల విద్యా రుణాలు, ఆడ పిల్లల వివాహ రుణాల మాఫీ కూడా కల్పించనున్నారు.  ఉద్యోగుల పిల్లల పేరిట రూ.5 లక్షల విద్యా రుణాలు, ఆడ పిల్లల వివాహాల కోసం చేసిన రూ.2 లక్షల వరకు రుణాలను మాఫీ చేయనుండగా, వీటికి ఎలాంటి ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేదు. ఈ బీమా కోసం ఉద్యోగి నెలకు రూ.200 బీమా ప్రీమియం చెల్లిస్తే సరిపోతుంది. 
 
ఆర్టీసీ ఉద్యోగులను ఇప్పటికే ప్రభుత్వంలో విలీనం చేసిన జగన్ ప్రభుత్వం తాజాగా, ఇన్సూరెన్స్ ప్యాకేజీని ప్రకటించడంతో ఉద్యోగులు ఆనందంలో ఉన్నారు. దీంతో ఉద్యోగులు సీఎం జగన్‌కు ధన్యవాదాలు చెబుతూ, మ‌హిళా కండ‌ర్ట‌ర్ జ‌గ‌న్ పోస్ట‌ర్ కు పాలాభిషేకం చేశారు. 
 
ఈ ఇన్సూరెన్స్ సౌకర్యం వల్ల 50,500 మంది ఆర్టీసీ ఉద్యోగులకు లబ్దిచేకూరనుంది. ఇప్పటి వరకు రాష్ట్రంలో పోలీసు శాఖలో ఈ తరహా ‘ కార్పొరేట్‌ శాలరీ ప్యాకేజీ’ని అమలు చేస్తుండగా, ఇప్పుడు ఆర్టీసీ ఉద్యోగులకు కూడా కల్పించింది.

త్వరలోనే ప్రభుత్వం దీనిపై మరింత విపులంగా విధివిధానాలను రూపకల్పన చేయనుంది. ఈ సందర్భంగా ఉద్యోగుల సంక్షేమానికి కృషి చేస్తున్న ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావుకి కార్మిక పరిషత్ రాష్ట్ర కమిటీ కృతజ్ఞతలు తెలిపింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పెట్రోల్, డీజిల్ పై రూ.4 అదనపు వ్యాట్ తగ్గించాలి!