ఢిల్లీ పర్యటనలో ఉన్న టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుతో వైకాపా రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు కలుసుకున్నారు. ఈ భేటీ ఏపీ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
ఈ భేటీ తర్వాత రఘురామకృష్ణంరాజు మీడియాతో మాట్లాడుతూ, పార్లమెంటు సమావేశాల ఆఖరి రోజున ఎంపీలు రాజీనామా చేసి విభజన హామీల కోసం కేంద్రం ఒత్తిడి తెద్దామని జగన్ గతంలో అన్నారని, గుర్తుచేశారు.
ప్రత్యేక హోదా కోసం రాజీనామాకు తాను సిద్ధంగా ఉన్నామని రఘురామ ప్రకటించారు. టీడీపీ ఎంపీల రాజీనామా కోసం ఒప్పించడానికే చంద్రబాబుతో భేటీ అయినట్టు ఆయన వెల్లడించారు.
కాగా, అధికార వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డితే విభేదించిన రఘురామకృష్ణంరాజు తనదైనశైలిలో రాజకీయాలు చేస్తున్నారు. ఆయన ఢిల్లీలో ఉంటూనే అధికార వైకాపా, ఆ పార్టీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రిపై విమర్శలు వర్షం కురిపిస్తున్నారు.