Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కృష్ణా జిల్లాలో చిరంజీవి- వంగవీటి ఫ్లెక్సీల ధ్వంసం.. కారణం ఏమిటి?

ప్రపంచ వ్యాప్తంగా ఖైదీ నెం.150 సినిమాకు ఫ్యాన్స్ బ్రహ్మరథం పడుతుంటే.. కృష్ణాజిల్లాలో మెగాస్టార్ చిరంజీవితో పాటు దివంగత నేత వంగవీటి రంగా చిత్రాలను గుర్తు తెలియని వ్యక్తులు కొందరు ధ్వంసం చేశారు. దీంతో క

Advertiesment
Protests in Krishna District as Chiranjeevi and Vangaveeti
, సోమవారం, 16 జనవరి 2017 (15:56 IST)
ప్రపంచ వ్యాప్తంగా ఖైదీ నెం.150 సినిమాకు ఫ్యాన్స్ బ్రహ్మరథం పడుతుంటే.. కృష్ణాజిల్లాలో మెగాస్టార్ చిరంజీవితో పాటు దివంగత నేత వంగవీటి రంగా చిత్రాలను గుర్తు తెలియని వ్యక్తులు కొందరు ధ్వంసం చేశారు. దీంతో కృష్ణాజిల్లాలో ఫ్యాన్స్ ఆగ్రహానికి గురైయ్యారు. ఆదివారం రాత్రి కైకలూరు మండలం అటపాకలో ఈ ప్లెక్సీలను చించేశారు. దీంతో సోమవారం ఉదయం అటు చిరంజీవి, రంగాలకు చెందిన అభిమాన సంఘాల ప్రతినిధులు, ఇటు రంగా అభిమానులు రహదారులపై నిరసనలకు దిగారు. దీంతో వాహనరాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. 
 
ఈ విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని నిందితులను పట్టుకుంటామని హామీ ఇచ్చినప్పటికీ, నిరసనలను విరమించేందుకు అభిమానులు ససేమిరా అంటున్నారు. దీంతో ఇంకా ఆందోళన కొనసాగుతుండగా, ఆ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది. ఈ ప్రాంతంలోని సీసీటీవీ కెమెరాలను పరిశీలిస్తున్నామని, నిందితులను గుర్తించేందుకు చర్యలు తీసుకున్నామని పోలీసులు వెల్లడించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అవును.. భార్య బాయ్‌ఫ్రెండ్‌‍ని కాల్చి చంపేసింది నేనే!: భార్య ఆత్మహత్య చేసుకుంది..