Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అవును.. భార్య బాయ్‌ఫ్రెండ్‌‍ని కాల్చి చంపేసింది నేనే!: భార్య ఆత్మహత్య చేసుకుంది..

ఫ్యామిలీ ఫ్రెండ్‌తో వివాహేతర సంబంధం కలిగివున్న కారణంగానే.. భార్యతో అక్రమ సంబంధం కలిగిన వ్యక్తిని హతమార్చానని నిందితుడు అంగీకరించాడు. బెంగళూరులో తన భార్యతో పాటు ఆమె బాయ్ ఫ్రెండ్ కారులో వెళ్తుండగా జీపీఆ

Advertiesment
Woman
, సోమవారం, 16 జనవరి 2017 (15:17 IST)
ఫ్యామిలీ ఫ్రెండ్‌తో వివాహేతర సంబంధం కలిగివున్న కారణంగానే.. భార్యతో అక్రమ సంబంధం కలిగిన వ్యక్తిని హతమార్చానని నిందితుడు అంగీకరించాడు. బెంగళూరులో తన భార్యతో పాటు ఆమె బాయ్ ఫ్రెండ్ కారులో వెళ్తుండగా జీపీఆర్ఎస్ ఆధారంగా వారిని ఛేజ్ చేశానని.. భార్య బాయ్‌ఫ్రెండ్‌ని కాల్చి చంపేశానని నిందితుడు పోలీసుల ఎదుట ఒప్పేసుకున్నాడు. అయితే బాయ్ ఫ్రెండ్ హత్యను కళ్లారా చూసిన అతని భార్య కూడా ఆత్మహత్యకు పాల్పడింది. 
 
వివరాల్లోకి వెలితే.. బెంగళూరుకు చెందిన న్యాయవాది అమిత్ (32). ఇతడు భార్యాభర్తలైన రాజేశ్, శ్రుతిల ఫ్యామిలీ ఫ్రెండ్.  రైల్వేగొల్లహళ్లి గ్రామ పంచాయతీ అభివృద్ధి అధికారిగా శృతి పనిచేస్తున్నారు. ఇటీవల కొంతకాలంగా శ్రుతిగౌడతో న్యాయవాది అమిత్‌కు వివాహేతర సంబంధం ఉందనే రాజేశ్ అనుమానపడుతూ వచ్చాడు. శుక్రవారం అమిత్‌, శృతిగౌడలు ఒకే కారులో వస్తుండగా వెంబడించిన రాజేశ్, అతడి తండ్రి గోపాలకృష్ణలు హెసరఘట్టరోడ్డులోని ఆచార్య కాలేజీ సమీపాన కారును అడ్డగించారు. డోర్‌ తెరవాలని రాజేశ్ హెచ్చరించినా అందుకు శ్రుతి నిరాకరించడంతో రాజేశ్ పిస్టల్‌తో అమిత్‌పై కాల్పులు జరిపారు.
 
అంతలోనే రాజేశ్, గోపాలకృష్ణలు పరారీ అయ్యారు. హుటాహుటిన అమితను సప్తగిరి ఆసుపత్రిలో చేర్పించిన శృతిగౌడ కాసేపటికే అదే ప్రాంతంలోని ఓ లాడ్జిలో గది అద్దెకు తీసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆపై హత్యకు కారకులైన రాజేశ్, గోపాలకృష్ణలు పోలీసులకు లొంగిపోయారు. శృతిగౌడతో అమితకు వివాహేతర సంబంధం ఉన్నందునే కొన్ని రోజులుగా గొడవలు సాగుతున్నాయని బహిరంగంగా తిరుగుతుండడంతో పిస్టల్‌తో కాల్చినట్లు అంగీకరించారు. దీంతో రాజేష్‌ను కోర్టు ముందు హాజరు పరిచిన పోలీసులు సమగ్ర విచారణ నిమిత్తం 15 రోజుల కస్టడీకి తీసుకున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సెల్ఫీ పిచ్చి.. గూడ్స్ రైలెక్కి సరదా కోసం సెల్ఫీ తీసుకున్నాడు.. వైర్లు తెగడంతో?