Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఏపీ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోడీ శుభాకాంక్షలు

Advertiesment
ఏపీ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోడీ శుభాకాంక్షలు
విజ‌య‌వాడ‌ , సోమవారం, 1 నవంబరు 2021 (10:32 IST)
రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఏపీ ప్రజలు నైపుణ్యం, ధృడ సంకల్పం, పట్టుదలకు మారుపేరని కొనియాడారు. 
 
 
విదేశీ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న భార‌త ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ ఈ మేరకు ట్విటర్‌లో స్పందిస్తూ, ‘ఆంధ్రప్రదేశ్‌లోని నా సోదరీమణులకు, సోదరులకు శుభాకాంక్షలు. ఏపీ ప్రజలు తమ నైపుణ్యం, దృఢ సంకల్పం, పట్టుదలకు మారు పేరు. అందువల్ల వారు అనేక రంగాల్లో రాణిస్తున్నారు. రాష్ట్ర ప్రజలు సంతోషంగా, ఆరోగ్యంగా, విజయవంతంగా ఉండాలని కోరుకుంటున్నాను.’ అని ట్వీట్‌ చేశారు.
 
 
మ‌రో ప‌క్క టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ కూడా త‌న మెసేజ్ ని ట్విట్ట‌ర్ లో పోస్ట్ చేశారు. రాష్ట్ర రాజధాని కోసం త్యాగం, భావితరాల భవిష్యత్తు కోసం పోరాటం. అణిచివేత, అవమానాలు ఎదురైనా ఎత్తిన జెండా దించకుండా 685 రోజులుగా జై అమరావతి అంటూ నినదిస్తున్న రైతులకు, మహిళలకు, యువతకు ఉద్యమాభివందనాలు. ఒకే రాష్ట్రం-ఒకే రాజధాని నినాదంతో, ప్రజా రాజధాని అమరావతి పరిరక్షణకి మీరు తలపెట్టిన మహా పాదయాత్ర విజయవంతం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆ శ్రీవారి ఆశీస్సులతో పాలకుల ఆలోచనధోరణిలో మార్పు వచ్చి అమరావతినే రాజధానిగా కొనసాగించాల‌ని నారా లోకేష్ ఆశాభావం వ్య‌క్తం చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పోలీసులకు ఒకటో తేదీన జీతాల్లేవు... సీఎంకు తెదేపా ఎమ్మెల్యే అనగాని లేఖ