ఏప ఉప ముఖ్యమంత్రి, సినీ హీరో, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తాజాగా చేసిన ట్వీట్ ఎంతో ఆసక్తికరంగా ఉంది. ఉత్తరాదిన ఉన్న హిమాలయా పర్వత శ్రేణులో పరమశువుని కైలాసం ఉందని, దక్షిణాదిన ఆయన కుమారుడు మురుగన్ నివాసం ఉందని, వారు వెలిసిన ప్రదేశమే ఈ భారతదేశమని పేర్కొన్నారు. ఇది జన్మాత ఆదేశమంటూ తన ఎక్స్ వేదికగా రాసుకొచ్చారు.
పిఠాపురం వేదికగా జరగిన జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో హిందీ భాషా నేపథ్యంలో చేసిన వ్యాఖ్యలు దక్షిణాన ముఖ్యంగా, తమిళనాడు రాష్ట్రంలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన విషయం తెల్సిందే. పవన్ చేసిన వ్యాఖ్యలకు సినీ నటుడు ప్రకాష్ రాజ్ కౌంటర్లు వేయగా, భారతీయ జనతా పార్టీ నేతలు మాత్రం పవన్ కళ్యాణ్‌కు మద్దతుగా వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో పవన్ చేసిన తాజా ట్వీట్ ప్రాధాన్యత సంతరించుకుంది.