Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పవన్ గురి తప్పింది... జగన్‌తో లింక్... చెప్పిందెవరు?

Advertiesment
పవన్ గురి తప్పింది... జగన్‌తో లింక్... చెప్పిందెవరు?
, మంగళవారం, 16 అక్టోబరు 2018 (20:11 IST)
వైఎస్ఆర్ సిపి జగన్మోహన్ రెడ్డితో పవన్ కల్యాణ్‌కు ఉన్న బంధం ఏమిటని శానసమండలి విప్ డొక్కా మాణిక్యవరప్రసాద్ ప్రశ్నించారు. జగన్ గురించి తనకు తెలియదని పవన్ అనడం విచిత్రంగా ఉందన్నారు. 2014 ఎన్నికల్లో ఒక అజెండా, 2019 ఎన్నికల్లో మరో అజెండా పట్టుకుని మాట్లాడడం సరికాదన్నారు. పవన్ కల్యాణ్ గురి తప్పిందన్నారు.
 
రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడిని ఎందుకు నిలదీయలేదని పవన్‌ను ఆయన ప్రశ్నించారు. రాష్ట్ర సమస్యలు, పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల అంశాలను జనసేన కవాతులో పవన్ ప్రస్తావించలేదన్నారు. పవన్ కల్యాణ్ నియమించిన జాయింట్ ఫ్యాక్ట్ కమిటీ ఏపీకి కేంద్ర ప్రభుత్వం రూ.75 కోట్లు ఇవ్వాలని చెప్పినా, దానిపై ఆయనెందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. పంచాయతీ ఎన్నికల నిర్వహణ బాధ్యత రాష్ట్ర ఎన్నిక సంఘానిదేనని స్పష్టం చేశారు.
 
యువతను రెచ్చగొట్టొద్దు...
యువతను రెచ్చగొట్టేలా మాట్లాడటం పవన్ కల్యాణ్ మానుకోవలని విప్ డొక్కా మాణిక్యవరప్రసాద్ హితవు పలికారు. ప్రజా సమస్యల పరిష్కారం అహింసా మార్గంలోనే సాగాలన్నారు. ఇవన్నీ మరిచిపోయి, తాటతీస్తా... నలిపేస్తా... అంటూ ఆవేశపూరితంగా మాట్లాడటం సరికాదన్నారు. రాజకీయాల్లో ఉండేవారు సంయమనం పాటించాలన్నారు. ఆవేశపూరితంగా మాట్లాడి పవన్ కల్యాణ్ తన ఉనికిని కోల్పోవద్దని హితవు పలికారు. లేకుంటే రానున్న ఎన్నికల్లో పవన్ కల్యాణ్ దారి తప్పడం ఖాయమని ఆయన హెచ్చరించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దేశంలో చంద్రబాబుకి అవినీతి పాలనలో మూడోస్థానం... ఎవరు?(Video)