Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

హమ్మయ్య.. ఎట్టకేలకు గుడివాడ అమర్నాథ్‌కు టిక్కెట్ దక్కింది..

jagan

ఠాగూర్

, బుధవారం, 13 మార్చి 2024 (09:15 IST)
వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే తమ అభ్యర్థుల జాబితాను తాజాగా ప్రకటించారు. ఇందులో కేవలం ఇద్దరు పేర్లు మాత్రమే ఉన్నాయి. రానున్న ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను వైకాపా నాయకత్వం విడతల వారీగా ప్రకటిస్తున్న విషయం తెల్సిందే. ఈ క్రమంలో అంతకుముందు ప్రటించిన అభ్యర్థులను కూడా మార్చేస్తున్నారు. తాజాగా మంగళవారం రాత్రి వైకాపా తన 12వ జాబితాను విడుదల చేసింది. ఇందులో కేవలం ఇద్దరి పేర్లు మాత్రమే ఉన్నాయి. 
 
వీరిలో గాజువాక ఇన్‌చార్జ్‌గా గుడివాడ అమర్నాథ్ పేరును ప్రకటించారు. ఈయన రాష్ట్ర ఐటీ మంత్రిగా ఉన్నారు. కానీ, ఈయనకు టిక్కెట్ రాదంటూ జోరుగా ప్రచారం సాగినప్పటికీ సీఎం జగన్ ఆయనపై నమ్మకం ఉంచి గాజువాక నుంచి బరిలోకి దించనున్నారు. అలాకే, చిలకలూరిపేట అసెంబ్లీ స్థానం నుంచి కావటి మనోహర్ నాయుడు పేరును ప్రకటించారు. మరోవైపు, కర్నూలు మేయర్‌గా బీసీ వర్గానికి చెందిన సి.సత్యనారాయణమ్ము నియమించినట్టు వైకాపా ప్రకటించింది. ప్రస్తుతం ఆమె కర్నూలు 25వ వార్డు కార్పొరేటర్‌గా ఉన్నారు. 
 
టీడీపీ - జనసేన - బీజేపీ ఉమ్మడి సభకు బస్సులు ఇచ్చేందుకు సిద్ధం... 
 
ఏపీఎస్ ఆర్టీసీ దిగివచ్చింది. ఈ నెల 17వ తేదీ ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో టీడీపీ, జనసేన, బీజేపీలు కలిసి నిర్వహించే ఉమ్మడి బహిరంగ సభకు ఆర్టీసీ బస్సులను అద్దెకు ఇచ్చేందుకు అంగీకరించింది. ఎన్ని బస్సులైనా ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్టు టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడుకి లేఖ రాసింది. 
 
టీడీపీ - జనసేన పార్టీ సభలకు ఆర్టీసీ బస్సు కావాలంటూ ఇన్నాళ్ళూ ఎన్నో అర్జీలు పెట్టుకున్నా ఒక్కటంటే ఒక్క బస్సును కూడా కేటాయించని ఆర్టీసీ అధికారులు ఇపుడు దిగివచ్చారు. టీడీపీ - జనసేన కూటమిలో బీజేపీ కూడా చేరడంతో ఇపుడు వారికి భయం పట్టుకుంది. దీంతో ఎన్ని బస్సులు కావాలో చెప్పాలని కోరారు. 
 
అయితే, ఆర్టీసీ యాజమాన్యం ఆకస్మికంగా తీసుకున్న ఈ నిర్ణయం వెనుకు బలమైన కారణం లేకపోలేదు. టీడీపీ - జనసేన పార్టీలో బీజేపీ కూడా కలిసింది. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో ఈ మూడు పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాయనే ప్రచారం జోరుగా సాగుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆ మూడు పార్టీల నేతల ఆగ్రహానికి గురికావడం ఎందుకని భావించిన ఆర్టీసీ ఉన్నతాధికారులు ఈ నిర్ణయం తీసుకున్నాయి. 
 
చిలకలూరిపేట సభకు బస్సులు కావాలంటూ అచ్చెన్నాయుడు ఇప్పటికే ఆర్టీసీ అధికారులకు లేఖ రాశారు వెంటనే స్పందించిన అధికారులు ఎన్ని బస్సులు కావాలో ఇండెంట్ ఇస్తే సమకూర్చుతామని సమాచారం పంపించారు. గత ఐదేళ్లుగా టీడీపీ, జనసేన పార్టీ సభలకు ఒక్కటంటే ఒక్క ఆర్టీసీ బస్సును కూడా కేటాయించని ఏపీఎస్ ఆర్టీసీ అధికారులు ఇపుడు ఎన్ని బస్సులైన సమకూర్చేందుకు సిద్ధంగా ఉన్నట్టు చెప్పడం విడ్డూరంగా ఉంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రచారం పిచ్చి పీక్‌కు చేరింది.. విద్యార్థులకు ఇచ్చిన ట్యాబ్‌ల్లోనూ జగన్ ప్రచార వీడియోలు