Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ప్రేమించలేదని కత్తితో కోశాడు.. ఆ తరువాత(వీడియో)

ప్రేమించలేదనే కారణంగా ఒక యువతిపై కత్తితో దాడికి దిగాడు ఉన్మాది. ప్రాణపాయస్థితిలో యువతి ఆసుపత్రిలో కొట్టుమిట్టాడుతోంది. చిత్తూరు జిల్లా చంద్రగిరిలో జరిగిన ఈ సంఘటన తీవ్ర సంచలనం సృష్టించింది. అనంతపురంకు చెందిన సుధాకర్ శెట్టి వ్యాపార నిమిత్తం తిరుపతికి వ

Advertiesment
oneside lover
, గురువారం, 15 జూన్ 2017 (19:47 IST)
ప్రేమించలేదనే కారణంగా ఒక యువతిపై కత్తితో దాడికి దిగాడు ఉన్మాది. ప్రాణపాయస్థితిలో యువతి ఆసుపత్రిలో కొట్టుమిట్టాడుతోంది. చిత్తూరు జిల్లా చంద్రగిరిలో జరిగిన ఈ సంఘటన తీవ్ర సంచలనం సృష్టించింది. అనంతపురంకు చెందిన సుధాకర్ శెట్టి వ్యాపార నిమిత్తం తిరుపతికి వచ్చి స్థిరపడ్డాడు. సుధాకర్ శెట్టికి నాగకేతన అనే కుమార్తె ఉంది. 
 
చంద్రగిరి సమీపంలోని కె.ఎం.ఎం.కళాశాలలో ఎంబిఎ మొదటి సంవత్సరం చదువుతోంది నాగకేతన. తిరుపతి పెద్దకాపు వీధికి చెందిన జలాల్ ఉద్దీన్ కుమారుడు మహ్మద్ తనీష్‌కు నాగకేతనకు చిన్నప్పటి నుంచి స్నేహం ఉంది. ఇద్దరు కలిసి ఒకే స్కూల్లో 4వ తరగతి నుంచి 7వ తరగతి వరకు చదువుకున్నారు. అంతేకాకుండా కుక్కలదొడ్డి సమీపంలోని ఒక ప్రైవేటు పాఠశాలలో కూడా వీరు కలిసే చదుకున్నారు. ముందు నుంచి నాగకేతన, మహ్మద్ తనీష్‌ను స్నేహితుడిగానే చూసేది. 
 
ఐతే తనను ప్రేమించాలని నాగకేతనను చిత్రహింసలు పెట్టేవాడు తనీష్. అప్పటి నుంచి తనీష్‌తో మాట్లాడటం మానేసింది నాగకేతన. తనీష్‌ చెన్నైకు వెళ్ళి ప్రైవేటు జాబ్ చేసుకుంటుండగా నాగకేతన్ మాత్రం విద్యనభ్యసిస్తోంది. అయితే నాగకేతనపై కోపం పెంచుకున్న తనీష్ కెఎంఎం కళాశాలలో చదువుతోందని తెలిసి గురువారం మధ్యాహ్నం కళాశాలకు వెళ్ళాడు. 
 
బస్సు కోసం నాగకేతన నిలబడి ఉండగా ప్రేమించమని, పెళ్ళి చేసుకుందామని బెదిరించాడు. యువతి ఒప్పుకోకపోవడంతో తన వెంట తెచ్చుకున్న కత్తితో దాడికి దిగాడు. భయంతో పరుగులు తీస్తున్న యువతిపై విచక్షణా రహితంగా దాడికి పాల్పడ్డాడు. వెంటనే స్థానికులు గుర్తించి తనీష్‌ను పట్టుకుని దేహశుద్ధి చేసి నాగకేతనను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం యువతి పరిస్థితి విషమంగా ఉంది. నిందితుడిని చంద్రగిరి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీడియో చూడండి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శిరీష పెదవులపై గాట్లు, తలపై గాయాలు... కొట్టి చంపి ఉరి వేశారా?, లింకుందన్న తేజస్విని ఎవరు?