శిరీష పెదవులపై గాట్లు, తలపై గాయాలు... కొట్టి చంపి ఉరి వేశారా?, లింకుందన్న తేజస్విని ఎవరు?
బ్యూటీషియన్ శిరీష పోస్టుమార్టమ్ రిపోర్టు వచ్చింది. ఈ రిపోర్టులో ఆమె మెడ ఎముక విరిగి చనిపోయినట్లు తేలింది. ఆమె శరీరంపై గాయాలున్నాయి. కంటి మీద, పెదవులపైన, తలపైన గాయాలయ్యాయి. పెనుగులాడినట్లు ఆనవాళ్లు కనబడుతున్నాయి. దీన్నిబట్టి చూస్తుంటే ఆమెను హత్య చేసి,
బ్యూటీషియన్ శిరీష పోస్టుమార్టమ్ రిపోర్టు వచ్చింది. ఈ రిపోర్టులో ఆమె మెడ ఎముక విరిగి చనిపోయినట్లు తేలింది. ఆమె శరీరంపై గాయాలున్నాయి. కంటి మీద, పెదవులపైన, తలపైన గాయాలయ్యాయి. పెనుగులాడినట్లు ఆనవాళ్లు కనబడుతున్నాయి. దీన్నిబట్టి చూస్తుంటే ఆమెను హత్య చేసి, ఉరి వేసుకున్నట్లు చిత్రీకరించారన్న అనుమానాలు బలపడుతున్నాయి. కాగా ఆమె ఉరి వేసుకోవడం వల్లనే చనిపోయిందా లేదా అన్నది తేలాల్సి వుంది.
ఇదిలావుంటే రాజీవ్-శిరీష్‌ల మధ్య సన్నిహిత సంబంధం వున్నదంటూ తేజస్విని అనే యువతి బంజారాహిల్స్ పోలీసు స్టేషనులో కేసు పెట్టినట్లు బయటకొచ్చింది. తేజస్విని అనే యువతి రాజీవ్ ను పెళ్లాడాలనుకున్నదనీ, ఐతే శిరీష-రాజీవులిద్దరూ సన్నిహితంగా వున్నట్లు అనిపించడంతో ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగి కేసు వరకూ వెళ్లిందంటున్నారు. ఈ కేసును పరిష్కరించుకునేందుకు బంజారాహిల్స్ పోలీసు స్టేషనుకు వెళ్లగా మరో రెండు రోజుల తర్వాత చూద్దాం అని అక్కడి పోలీసులు చెప్పి పంపారు.
ఈ క్రమంలోనే శ్రావణ్ అనే వ్యక్తి లైన్లోకి వచ్చాడు. తనకు కుకునూర్ పల్లి ఎస్సై ప్రభాకర్ రెడ్డి బాగా తెలుసుననీ, అక్కడ కేసు పరిష్కరించుకుందామని వారిని అక్కడికి తీసుకెళ్లాడు. అక్కడికి వెళుతూ మార్గమధ్యంలోనే బీరు తీసుకుని సేవించారు. ఆ తర్వాత అర్థరాత్రి సమయంలో రిసార్టుకు వెళ్లారు. ఆ రిసార్టులోనే గొడవ మొదలైనట్లు తెలుస్తోంది.
శిరీష పట్ల ఎస్సై ప్రభాకర్ రెడ్డి అసభ్యంగా ప్రవర్తించడంతో ఆమె కేకలు వేసిందనీ, వారించినా వినకుండా గట్టిగా కేకలు వేస్తుండటంతో రాజీవ్ ఆమెపై చేయి చేసుకున్నాడని సమాచారం. ఐతే ఈ క్రమంలోనే ఆమెను కొట్టి చంపేసి, శవాన్ని హైదరాబాద్ తీసుకువచ్చారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలావుంటే కేసు పెట్టిన తేజస్విని ఇంతవరకూ ఎవరనేది వెలికి రాలేదు. ఇందులో ఆమె పాత్ర ఏమిటన్నది బయటకు రావాలని శిరీష తల్లి డిమాండ్ చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ పోస్టుమార్టమ్ నివేదిక పూర్తి వివరాలు వెలికి వస్తే కానీ అసలు సంగతి తెలియదు.