మాజీ ఎంపీ రఘురామకృష్ణంరాజు శుక్రవారం తెలుగుదేశం పార్టీలో చేరారు. పాలకొల్లులో చంద్రబాబు నాయుడుని కలిసిన ఆయన అధికారికంగా తెలుగుదేశం పార్టీలో చేరారు. రఘు రామకృష్ణంరాజును చంద్రబాబు నాయుడు తెలుగుదేశంలోకి సాదరంగా స్వాగతించారు.
గతంలో, ఆర్ఆర్ఆర్ 2018లో తిరిగి తెలుగుదేశంతో కొంతకాలం ఉన్నారు. అయితే 2019లో నరసాపురం లోక్‌సభ టిక్కెట్‌ను దక్కించుకుని వైసీపీలో చేరారు. ప్రస్తుతం తిరిగి తెలుగుదేశంలోకి చేరారు. ఆర్‌ఆర్‌ఆర్ ఉండి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ టికెట్‌పై పోటీ చేసే అవకాశం ఉందని చర్చ జరుగుతోంది.