అదే చైతన్య రథంపై హరికృష్ణ అంతిమయాత్ర..
మహానేత నందమూరి తారకరామారావు తనయుడు, సినీనటుడు, టీడీపీ సీనియర్ నేత నందమూరి హరికృష్ణ మృతి తెలుగు రాష్ట్రాల ప్రజలను దిగ్భ్రాంతికి గురిచేసింది. హైదరాబాద్ నుంచి నెల్లూరుకి స్నేహితుడి కుమారుడి పెళ్లికి వెళు
మహానేత నందమూరి తారకరామారావు తనయుడు, సినీనటుడు, టీడీపీ సీనియర్ నేత నందమూరి హరికృష్ణ మృతి తెలుగు రాష్ట్రాల ప్రజలను దిగ్భ్రాంతికి గురిచేసింది. హైదరాబాద్ నుంచి నెల్లూరుకి స్నేహితుడి కుమారుడి పెళ్లికి వెళుతుండగా.. ఆయన ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది.
తీవ్రగాయాలపాలైన హరికృష్ణ కామినేని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. కామినేని ఆస్పత్రి నుంచి హరికృష్ణ మృతదేహం మెహదీపట్నంలోని ఆయన నివాసానికి చేరుకుంది.
గురువారం హరికృష్ణ పార్థివ దేహానికి అంత్యక్రియలు జరుగనున్నాయి. హరికృష్ణ అంత్యక్రియలు అందరికీ గుర్తుండేలా చేయాలని ఆయన కుమారులు భావిస్తున్నారు. అందుకే 1983 నాటి చైతన్య రథంపై హరికృష్ణ అంతిమయాత్ర నిర్వహించాలని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది.
దివంగత సీఎం మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు 1983లో రాష్ట్రమంతటా ప్రచారం నిర్వహించిన చైతన్య రథంపై హరికృష్ణ అంతిమయాత్ర నిర్వహించాలని ఏర్పాట్లు చేస్తున్నారు.
అప్పట్లో తండ్రి ఎన్టీఆర్ ఎన్నికల ప్రచారానికి అన్నీ తానై నడిపించారు హరికృష్ణ. ఆ చైతన్య రథానికి అప్పుడు హరికృష్ణే సారథిగా వ్యవహరించారు. ఇప్పుడు అదే రథంపై హరికృష్ణ అంతిమయాత్ర నిర్వహించాలని భావిస్తున్నారు. హైదరాబాద్‌లోని రామకృష్ణ సినీ స్టూడియోలో ఉన్న చైతన్యరథాన్ని అంతిమయాత్రకు సిద్ధం చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.