Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Wednesday, 9 April 2025
webdunia

నంద్యాల జేజమ్మ అఖిలప్రియ.. పశుపతి ఎవరు.. వెలసిన పోస్టర్లు.. వైరల్

నంద్యాల ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ భారీ మెజారిటీతో టీడీపీ ఘన విజయం సాధించింది. ఇప్పటిదాకా పోలైన ఓట్లలో 50 శాతం ఓట్లను తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంది. తద్వారా 16 రౌండ్లు పూర్తయ్యేసరికి 86,555 ఓ

Advertiesment
NandyalaByElection
, సోమవారం, 28 ఆగస్టు 2017 (14:00 IST)
నంద్యాల ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ భారీ మెజారిటీతో టీడీపీ ఘన విజయం సాధించింది. ఇప్పటిదాకా పోలైన ఓట్లలో 50 శాతం ఓట్లను తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంది. తద్వారా 16 రౌండ్లు పూర్తయ్యేసరికి 86,555 ఓట్లను టీడీపీ సాధించింది. తెలుగుదేశం పార్టీ గెలుపొందడంతో పార్టీ నేతలు, కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. ఈ ఉపఎన్నికల్లో విజయం సాధించిన భూమ బ్రహ్మానందరెడ్డికి పలువురు అభినందనలు తెలుపుతున్నారు. 
 
ఈ నేపథ్యంలో టీడీపీ విజయానికి ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు కృషి చేసినప్పటికీ అందరికంటే ఎక్కువగా భూమా అఖిలప్రియకే గుర్తింపు లభించింది. చిన్న వయస్సులోనే నంద్యాల ఎన్నికల కోసం తీవ్రంగా శ్రమించారు. ఎన్నికలను ముందుండి ఎదుర్కొన్నారు. 
 
తన తల్లిదండ్రుల ఆశయాలను, టీడీపీ అభివృద్ధి మంత్రాన్ని ప్రచారాస్త్రాలుగా చేతబట్టి ఓటర్లను ఆకట్టుకున్నారు. తద్వారా గెలుపును సొంతం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో నంద్యాలలో అఖిలప్రియతో ఏర్పాటు చేసిన పోస్టర్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 
 
'అరుంధతి' సినిమాలో నటి అనుష్క జేజెమ్మ వేషధారణలో ఉన్న అఖిలప్రియ ఫొటోను ఈ పోస్టర్‌లో ముద్రించారు. 'నంద్యాల జేజమ్మ.. ఇక్కడ ఏ పశుపతి ఆటలు సాగవ్' అనే హెచ్చరికను పోస్ట‌ర్‌పై ముద్రించారు. ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ పోస్టర్లను నంద్యాలలో చాలాచోట్ల అతికించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జగన్ బాబాతో చాలా డేంజర్.. మంత్రి అచ్చెన్నాయుడు