Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Nara Lokesh: నారా లోకేష్ సీఎం అవుతారా? డిప్యూటీ సీఎం అవుతారా? అర్థమేంటి? (Video)

Advertiesment
Nara Lokesh

సెల్వి

, సోమవారం, 27 జనవరి 2025 (15:25 IST)
గత వారం రోజులుగా సోషల్ మీడియాలో జరుగుతున్న పరిణామాల గురించి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జనసేన మద్దతుదారులకు బహిరంగ లేఖ రాశారు. నారా లోకేష్‌ను మరో డిప్యూటీ సీఎంగా చేయాలనే డిమాండ్లు టీడీపీలో వినిపిస్తుండటంతో, జనసేన మద్దతుదారులు అభద్రతా భావానికి గురైయ్యారు. అయితే రెండు పార్టీలు ఈ విషయంపై బహిరంగంగా వ్యాఖ్యానించలేదు. 
 
ఇప్పుడు పవన్ కళ్యాణ్ రాసిన ఈ బహిరంగ లేఖ వీటికి ఫుల్ స్టాప్ పెట్టాయి. ఆ లేఖలో పవన్ కళ్యాణ్, తాను పదవుల కోసం పరిగెత్తే వ్యక్తిని కాదని, రాష్ట్రం, ప్రజల గురించి మాత్రమే దృష్టి సారిస్తానని పేర్కొన్నారు. కూటమిని, ప్రభుత్వాన్ని బలహీనపరిచే అంశాల గురించి మాట్లాడవద్దని ఆయన పార్టీ మద్దతుదారులను కోరారు. 
 
మార్చి 14న పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ భవిష్యత్తు ప్రణాళికలను చర్చిస్తామని పవన్ చెప్పారు. ఈ లేఖ జనసేన పార్టీలోనే పలు ఊహాగానాలకు తావిస్తోంది. పవన్ కళ్యాణ్ నారా లోకేష్‌ను ముఖ్యమంత్రిగా చేయడానికి అంగీకరించారని, ఆయన నెమ్మదిగా తన మద్దతుదారులను దాని కోసం సిద్ధం చేస్తున్నారని కూడా వార్తలు వస్తున్నాయి. 
 
గత కొద్దిరోజులుగా నారా లోకేష్ అతి త్వరలో ముఖ్యమంత్రి అవుతారని వార్తలు వస్తున్నాయి. మార్చి 14న పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గంలో జనసేన మూడు రోజుల పాటు పార్టీ ప్లీనరీని నిర్వహించనుంది.
 
ఇకపోతే.. నారా లోకేష్ పదవుల విషయంలో నిజానిజాలు ఎలా ఉన్నా లోకేశ్ ఉప ముఖ్యమంత్రి కావడం దాదాపుగా ఖాయమని తెలుస్తోంది. ఈ ప్రచారంపై నారా లోకేశ్ ఇచ్చిన సమాధానమే ఇందుకు కారణం. సీఎం అవుతారా లేక డిప్యూటీ సీఎం అవుతారా అంటూ పశ్నించిన మీడియాకు నారా లోకేశ్ ఇచ్చిన సమాధానం పరోక్షంగా అవుననే సంకేతాలనిస్తోంది. 
 
ముఖ్యమంత్రి చంద్రబాబు ఏ పదవి ఇచ్చినా స్వీకరించి అహర్నిశలు కష్టపడతానని, పార్టీని బలోపేతం చేస్తానని చెప్పుకొచ్చారు. అయితే ఒక వ్యక్తి ఒకే పదవిలో మూడు సార్లు ఉండకూడదన్నారు. ఇప్పటికే టీడీపీ జాతీయ కార్యదర్శిగా రెండు సార్లు ఉన్నానని, ఇక మూడోసారి ఉండకూడదనుకుంటున్నానన్నారు. 
 
నారా లోకేశ్ చేసిన ఈ వ్యాఖ్యలకు చాలా అర్ధాలు కన్పిస్తున్నాయి. టీడీపీ జాతీయ కార్యదర్శి పదవి మూడోసారి వద్దని చెప్పడం ద్వారా సీఎం లేదా డిప్యూటీ సీఎం పదవికి ఎలాంటి ఇబ్బంది రాకుండా చూసుకున్నారు. అంతే కాకుండా సీఎం లేదా డిప్యూటీ సీఎం పదవులు తనకు వద్దని ఖండించలేదు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గ్రామ సచివాలయాల్లో పనులు లేకుండా కూర్చునే ఉద్యోగులున్నారు, కనిపెట్టిన కూటమి ప్రభుత్వం షాకింగ్ నిర్ణయం