నిమ్మగడ్డ రమేష్ కుమార్. ఈయన గురించి పెద్దగా చెప్పనవసరం లేదు. బలమైన ప్రభుత్వంపై పోరాటం చేసి చివరకు విజయం సాధించారు. న్యాయస్థానాలను ఆశ్రయించారు. ప్రభుత్వం బేఖాతరు చేసింది. చివరకు గవర్నర్ ఆదేశాలతో ప్రభుత్వం దిగొచ్చింది. ఎన్నికల కమిషనర్‌గా నియమించింది.
అర్థరాత్రి ఈ ఉత్తర్వులు వెలువడ్డాయి. ఇదంతా బాగానే ఉన్నా ఇప్పుడు నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఏం చేస్తారోనన్నది ఆసక్తికరంగా మారుతోంది. గతంలో స్థానిక సంస్థల ఎన్నికలను నిలుపుదల చేస్తూ నిర్ణయం తీసుకోవడం సిఎంకు ఏ మాత్రం ఇష్టం లేదు.
దీంతో చివరకు చెన్నై నుంచి కనకరాజ్ అనే వ్యక్తిని తీసుకొచ్చి ఎన్నికల కమిషనర్‌గా నియమించారు. ఆ తరువాత రాజకీయ దుమారం రేగింది. నిమ్మగడ్డ రమేష్ కుమార్ హైకోర్టుకు వెళ్ళారు. ఆ తరువాత సుప్రీంకోర్టుకు వెళ్ళారు. చివరకు కోర్టు గవర్నర్‌కు సూచిస్తే ఆయన్ను కలిశారు.
చిట్టచివరకు గవర్నర్ ఆదేశాలతోనైనా ప్రభుత్వం వెనక్కి తగ్గింది. ఇదంతా బాగానే ఉన్నా ఇప్పుడు నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆగష్టు 3వ తేదీ బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నదే ఆశక్తికరంగా మారుతోంది. కరోనా వైరస్ సమయంలో స్థానిక సంస్ధల ఎన్నికలను వాయిదా వేసి వైసిపి నేతలకు మింగుడు పడకుండా చేసిన నిమ్మగడ్డ ప్రభుత్వాన్ని ఏవిధంగా ఇరకాటంలో పెడుతారోనన్నది ఇప్పుడు చర్చకు దారితీస్తోంది.