తెలుగుదేశం పార్టీ ఓటమి పాలైన తరువాత సోషల్ మీడియా వేదికగా ఏపీ సీఎం వైఎస్ జగన్‌పై విమర్శలు చేస్తున్నారు లోకేశ్. వైసీపీ ప్రభుత్వంపై తనదైన స్టయిల్లో సెటైర్లు వేస్తున్నారు. వైసిపి అధికారంలోకి వచ్చిన తరువాత ఏపీలో కరెంట్ కోతలు పెరిగాయంటూ గత కొద్దిరోజులుగా టీడీపీ ఆరోపణలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే.
కరెంట్ కోతలు వుండడం వాస్తవం కూడా.. అయితే దీనిపై నారా లోకేశ్, ప్రభుత్వంపై ట్విట్టర్లో సెటైర్లు వేశారు. ‘రావాలి కరెంట్.. కావాలి కరెంట్’ అంటూ వైసీపీ ప్రభుత్వాన్ని, ఆ పార్టీ ఫ్యాన్ గుర్తును బ్రతిమాలుతున్నారని ఎద్దేవా చేశారు.
బయట చూస్తే ప్రజలంతా రావాలి కరెంట్, కావాలి కరెంట్ అని మీ ప్రభుత్వాన్ని, మీ పార్టీ గుర్తునీ బతిమిలాడుకుంటున్నారు.
మీరు కాస్త చీకట్లోంచి బయటకు వచ్చి
ప్రజలకు కరెంట్ ఇవ్వాలని నారా లోకేశ్ సూచించారు. ఈ మేరకు ఓ వీడియోను లోకేశ్ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. మరి ‘రావాలి కరెంట్.. కావాలి కరెంట్’ అంటూ వేసిన లోకేష్ సెటైర్‌కు వైసిపి ఏ రకంగా కౌంటర్ ఇస్తుంది చూడాలి.