Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మతిస్థిమితం లేని 18ఏళ్ల యువతిపై ఐదుగురు మృగాళ్ల దుశ్చర్య.. బాగోలేదని ఆస్పత్రికి తీసుకెళ్తే?

కామాంధులు రెచ్చిపోతున్నారు. చిన్నాపెద్దా తేడా లేకుండా మహిళలపై విరుచుకుపడుతున్నారు. తాజాగా పాక్షికంగా మతిస్థిమితం లేని 18 ఏళ్ల యువతిని ఐదుగురు మృగాళ్లు చెరబెట్టి.. నాలుగు నెలలుగా అత్యాచారానికి పాల్పడ్డ

Advertiesment
Nalgonda crime news: 18 years girl gang raped
, శుక్రవారం, 27 జనవరి 2017 (15:22 IST)
కామాంధులు రెచ్చిపోతున్నారు. చిన్నాపెద్దా తేడా లేకుండా మహిళలపై విరుచుకుపడుతున్నారు. తాజాగా పాక్షికంగా మతిస్థిమితం లేని 18 ఏళ్ల యువతిని ఐదుగురు మృగాళ్లు చెరబెట్టి.. నాలుగు నెలలుగా అత్యాచారానికి పాల్పడ్డారు. కామాంధుల దుశ్చర్యతో బాధితురాలు గర్భం దాల్చింది. ఈ ఘటన నల్గొండ జిల్లా మాడ్గులపల్లి మండలం కుక్కడం గ్రామంలో ఆలస్యంగా వెలుగుచూసింది. 
 
అనారోగ్యంతో బాధపడుతున్న ఆ యువతిని ఆమె సోదరుడు ఆస్పత్రికి తీసుకెళ్లగా గర్భవతని వైద్యులు నిర్ధారించడంతో విషయం బయటపడింది. అతడి ఫిర్యాదుమేరకు కేసు నమోదు చేసి నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఒకరు పరారీలో ఉన్నారు. 
 
18 ఏళ్ల యువతిని ఐదుగురు మృగాళ్లు నాలుగు నెలల పాటు అత్యాచారం చేశారు. బాధితురాలికి తల్లిదండ్రులు లేకపోవడంతో తోడుగా ఉండాల్సిన సోదరుడు జీవనోపాధి కోసం నకిరేకల్‌కు వలస వెళ్లాడు. ఒంటరిగా మిగిలిన ఆ యువతి ఇంటి వద్దే ఉంటూ స్థానికంగా ఉన్న మేనత్త వద్ద రక్షణ పొందుతోంది. ఒంటరిగా ఉంటున్న యువతిపై ఒకరితరువాత ఒకరు నాలుగు నెలలుగా గ్రామానికి చెందిన ఐదుగురు యువకులు అత్యాచారం చేశారు. 
 
అనారోగ్యంతో బాధపడుతున్న ఆ యువతిని ఆమె సోదరుడు ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్య పరీక్షలు చేయించగా, మూడు నెలల గర్భవతి అని వైద్యులు నిర్ధారించడంతో ఈ దురాగతం వెలుగులోకి వచ్చింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సంఘ విద్రోహ శక్తులు ఐస్ హౌస్ పోలీస్ స్టేషన్‌‍ని తగులబెట్టారు: సీఎం పన్నీర్ సెల్వం