Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

శ్రీవారి కాలినడక భక్తులకు గొడ్డళ్లు - కోడికత్తులు ఇస్తారేమో : రఘురామ ఎద్దేవా

Advertiesment
raghuramakrishnamraju
, గురువారం, 17 ఆగస్టు 2023 (08:49 IST)
కలియుగ ప్రత్యక్షదైవంగా భావించే శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనం కోసం వెళ్లే భక్తులకు ఇకపై చేతికర్రల స్థానంలో గొడ్డళ్లు, కోడికత్తెలు ఇస్తారేమో అంటూ వైకాపా రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు ఎద్దేవా చేశారు. తిరుమల అలిపిరి మార్గంలో నడిచి వెళ్లే భక్తులకు చిరుత పులి దాడి నుంచి స్వీయరక్షణ పొందేందుకు వీలుగా తితిదే చేతి కర్రలు ఇస్తున్న విషయం తెల్సిందే. దీనిపై రఘురామ రాజు మీడియాతో మాట్లాడుతూ, తిరుమలలో కాలినడకన వెళ్లే భక్తులకు రక్షణ కోసం జగనన్న స్టిక్కర్లతో కూడిన కర్రలు ఇవ్వడం కాదని, వాక్‌ వే నిర్మించాలన్నారు. 
 
'భక్తులకు మా పార్టీ అధికార ఆయుధం గొడ్డలి, కోడి కత్తి ఇస్తారేమోనని అనుమానం వచ్చింది. ఒకవేళ ఇప్పుడు కర్రలు ఇచ్చినా తరువాత గొడ్డలి ఇస్తారేమో చూడాలి. తనను తాను సింహంగా చెప్పుకొనే జగన్‌ ఫొటోతో కూడిన మాస్కులను ఇస్తే అవి ధరించి నడిచే భక్తులకు వన్య మృగాల నుంచి ప్రమాదం ఉండకపోవచ్చు' అంటూ ఎద్దేవా చేశారు. శేషాచలం అడవుల్లో సాగుతున్న విధ్వంసానికి భయపడి వన్యమృగాలు ప్రాణ రక్షణ కోసం తమ మార్గాలను మార్చుకున్నాయని పేర్కొన్నారు. 
 
మరోవైపు, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం విడుదల చేసిన లిక్కర్‌ బాండ్లకు ఒక్కరూ సబ్‌స్క్రైబ్‌ చేయకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం దివాలా తీసినట్లు తేటతెల్లమైందని రఘురామ అభిప్రాయపడ్డారు. దీనిపై సీఎం జగన్‌, ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. 'మద్యం ఆదాయాన్ని పదేళ్లపాటు తాకట్టు పెట్టి రాష్ట్ర ప్రభుత్వం 11,500 కోట్ల రూపాయలకు లిక్కర్‌ బ్రాండ్లు విక్రయించాలని నిర్ణయించింది. గతంలో 9.9 శాతం రిటర్న్స్‌తో లిక్కర్‌ బాండ్లను విడుదల చేసింది. 
 
ేరూ.పదివేల కోట్ల రుణంపై ఏటా రూ.వెయ్యి కోట్లు వడ్డీగా చెల్లించడంతోపాటు, అంతిమంగా రూ.10 వేల కోట్ల అసలు చెల్లించాల్సి ఉంటుంది. అంటే రూ.పది వేల కోట్ల రుణానికి అదనంగా రూ.పది వేల కోట్ల వడ్డీ చెల్లించడం అన్నమాట. కానీ ఇప్పుడు ఖజానాలో దమ్మిడీ లేకుండానే బాండ్లను విడుదల చేశారు. ప్రభుత్వంపై నమ్మకం లేక కొనడానికి ఎవరూ ముందుకురాలేదు. రాష్ట్ర ప్రభుత్వం బాండ్ల ద్వారా రుణ ప్రయత్నాలు ప్రారంభించగానే కాగ్‌, ప్రధాని, ఆర్థికమంత్రి, ఆర్బీఐలకు నేను లేఖలు రాశాను' అని రఘురామ వివరించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రుషికొండకు బోడిగుండు కొట్టేశారు.. 21 ఎకరాల్లో తవ్వకాలు : జనసేన కార్పొరేటర్ మూర్తి