వైకాపా రెబల్, నర్సాపురం వైకాపా ఎంపీ రఘురామ రెడ్డి మాజీ మంత్రి నారాయణ అరెస్టును ఖండించారు. పదో తరగతి ప్రశ్నపత్రాల లీకేజీ విషయంలో 36 మందిని అరెస్టు చేసినట్లు ప్రభుత్వం ఇటీవల చెప్పిందన్నారు.
ఈ వ్యవహారానికి సంబంధించి నారాయణను అరెస్ట్ చేయడం న్యాయమైతే.. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డితో పాటు విద్యా శాఖ మంత్రి బొత్సను కూడా అరెస్ట్ చేయాలి కదా అంటూ ఆర్ఆర్ఆర్ ప్రశ్నించారు.
నారాయణ, శ్రీచైతన్య పాఠశాలల నుంచే పదో తరగతి ప్రశ్నప్రతాలు లీక్ అయ్యాయని సీఎం జగన్ అన్నారు. అన్యాయంగా తమపై అపవాదులు వేస్తున్నారని చెప్పారు. ఆ తర్వాత రోజు అదంతా అబద్ధమని బొత్స తెలిపారు. ఇందులో ఏది నిజం? అంటూ నిలదీశారు.
నారాయణను అభిమానించే వాళ్లు అప్రమత్తంగా ఉండాలి. ఆయన ఎంత ఫిజికల్ ఫిట్‌గా ఉన్నారో తెలియదు. రెండు మూడు దెబ్బలు కొడితే ఏదైనా జరగొచ్చునని హెచ్చరించారు. దయచేసి వెంటనే కోర్టును ఆశ్రయించండని ఆర్ఆర్ఆర్ చెప్పారు.