Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సీఎం గారూ... మీరే శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే?

Advertiesment
సీఎం గారూ... మీరే శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే?
విజ‌య‌వాడ‌ , బుధవారం, 20 అక్టోబరు 2021 (10:49 IST)
రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతోన్న పరిణామాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయ‌ని, ప్రతిపక్ష పార్టీ నేతల కార్యాలయాలు, ఇళ్లపై అధికార పార్టీ నేతలు, కార్యకర్తలు దాడి చేయడం అమానుషమైన చర్య కాదా? అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ప్ర‌శ్నించారు. తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసిన గంటా శ్రీనివాస‌రావు సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి బ‌హిరంగ లేఖ రాశారు. 
 
పట్టాభి మీడియా సమావేశంపై మీకు అభ్యంతరాలు ఉండొచ్చు, తప్పేమీ కాదు, కానీ దానికి అనుసరించాల్సిన విధానాలు ఖచ్చితంగా ఇవి మాత్రం కాదని నేను స్పష్టంగా చెప్పదలచుకున్నాను. రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడాల్సింది మీరే, అలాంటిది మీరే శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఎవరికి  చెప్పాలి? ఆ మాత్రం కనీస విఘ్నత టీడీపీ కార్యాలయాల మీద దాడి చేయమని సలహా ఇచ్చిన వారికి తెలీదా? నిజంగా మీరు డ్రగ్స్ వ్యాపారాలు చేయకపోతే, గంజా స్మగ్లింగ్ నిర్ములనకు చిత్తశుద్ధి ఉంటే ప్రతిపక్ష నేతల విమర్శలు ఖండించండి. రాజకీయ విమర్శలను ఎదుర్కోవడం నాయకుడి సహజ లక్షణం కావాలి, కానీ ఇలా ఫ్యాక్షనిజంని గుర్తు చేసేలా సంఘటనలు చోటు చేసుకోవడం బాధగా ఉంది...అని గంటా ఆవేద‌న వ్య‌క్తం చేశారు. 
 
ఇప్పటికైనా మీరు జోక్యం చేసుకుని ఇలాంటివి పునరావృతం కాకుండా చూస్తారని విజ్ఞప్తి చేస్తున్నాను అని సీఎంకు ఎమ్మెల్యే గంటా శ్రీనివాస‌రావు పేర్కొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తెదేపా రాష్ట్ర బంద్ : దేవినేని ఈడ్చుకెళ్లి వ్యానులో కుక్కిన పోలీసులు