Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తిరుపతి లాడ్జిలో ఇంటర్ విద్యార్థిని సాయి ప్రజ్వల...

హైదరాబాద్ శివార్లలోని మేడిపల్లిలో అదృశ్యమైన నారాయణ కాలేజీకి చెందిన ఇంటర్ విద్యార్థిని సాయి ప్రజ్వల ఆచూకీ తెలిసింది. ఆమె తిరుపతిలోని ఓ లాడ్జిలో బసచేసినట్టు పోలీసులు గుర్తించారు. అయితే, ఇపుడు ఆమె వ్యవహా

Advertiesment
Narayana College
, మంగళవారం, 17 అక్టోబరు 2017 (09:56 IST)
హైదరాబాద్ శివార్లలోని మేడిపల్లిలో అదృశ్యమైన నారాయణ కాలేజీకి చెందిన ఇంటర్ విద్యార్థిని సాయి ప్రజ్వల ఆచూకీ తెలిసింది. ఆమె తిరుపతిలోని ఓ లాడ్జిలో బసచేసినట్టు పోలీసులు గుర్తించారు. అయితే, ఇపుడు ఆమె వ్యవహారశైలిపై పోలీసులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. చదవలేక పారిపోయిందా? ఎవరితోనైనా ఎగిరిపోయిందా? అనే అంశంపై కూపీ లాగుతున్నారు. 
 
హైదరాబాద్‌లోని నారాయణ కాలేజీకి చెందిన సాయి ప్రజ్వల అనే విద్యార్థిని అదృశ్యమైపోతూ.. కాలేజీ యాజమాన్యంపై తీవ్రమైన ఆరోపణలు చేసిన విషయం తెల్సిందే. నారాయణ కాలేజీలో చదువుల పేరుతో విద్యార్థులను వేధిస్తున్నారని, వెంటనే కాలేజీలను మూసివేయాలని కోరింది. ఈ ఘటన హైదరాబాద్ శివార్లలోని మేడిపల్లిలో కలకలం సృష్టించింది. ఆ విద్యార్థిని అదృశ్యమవుతూ రాసిపెట్టిన ఓ లేఖ కలకలం సృష్టించింది. కాలేజీలో వేధింపుల వల్ల తాను తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నానని, వాటిని తట్టుకోలేకపోతున్నానని కూడా ప్రజ్వల తన లేఖలో ప్రస్తావించింది.
 
"సారీ డాడీ, సారీ మమ్మీ, ఐ మిస్ యూ సో మచ్. బై అక్క. వేస్ట్ నారాయణ కాలేజ్. దే ఆర్ కిల్లింగ్ ది స్టూడెంట్స్ టూ రీడ్. సో ప్లీజ్ హెల్ప్ ది స్టూడెంట్స్ ఫ్రమ్ నారాయణ" అంటూ లేఖ రాసి ఇంట్లోంచి వెళ్లిపోయింది. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన మేడిపల్లి పోలీసులు దర్యాఫ్తు చేపట్టారు. ఇంటి నుంచి బయలు దేరిన తర్వాత సాయి ప్రజ్వల ఎటు వెళ్లిందన్న విషయాన్ని సీసీటీవీ ఫుటేజ్‌ల ఆధారంగా పరిశీలించి ఆచూకీ కనుగొన్నారు. 
 
ఈమేరకు సాయి ప్రజ్వల దిగినట్టు భావిస్తున్న హోటల్ సీసీ కెమెరాలను, రికార్డులను వారు పరిశీలిస్తున్నారు. కాగా, చదువులో ఒత్తిడిని తట్టుకోలేక పోతున్నానని చెబుతూ, తల్లిదండ్రులకు, సోదరి, సోదరులకు క్షమాపణలు చెబుతూ, తాను ఇంటి నుంచి వెళ్లిపోతున్నట్టు ప్రజ్వల లేఖ రాసిన సంగతి తెలిసిందే. ఇక ప్రజ్వల మాయం వెనుక ప్రేమ కోణం ఉండివుండవచ్చని కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రజ్వల తండ్రి తిరుపతికి చేరుకున్న తరువాత ఈ విషయంలో పూర్తి స్పష్టత వచ్చే అవకాశాలున్నాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శ్రీశైలానికి భారీ వరద ... 7 గేట్ల ఎత్తివేత