Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Wednesday, 9 April 2025
webdunia

గర్భంతో వున్న అమృతవర్షిణి.. నాన్న అబార్షన్ చేసుకోమని ఒత్తిడి తెచ్చేవాడు..

దళిత యువకుడు ప్రణయ్ హత్యకు నిరసనగా దళిత సంఘాలు శనివారం మిర్యాలగూడలో బంద్ ప్రకటించాయి. హత్యకు సుపారీ ఇచ్చిన అమ్మాయి తండ్రి, రియల్టర్ మారుతీరావును వెంటనే అరెస్ట్ చేయాలంటూ ర్యాలీ నిర్వహించాయి. ఈ నేపథ్యంల

Advertiesment
Amruthavarshini
, శనివారం, 15 సెప్టెంబరు 2018 (14:31 IST)
దళిత యువకుడు ప్రణయ్ హత్యకు నిరసనగా దళిత సంఘాలు శనివారం మిర్యాలగూడలో బంద్ ప్రకటించాయి. హత్యకు సుపారీ ఇచ్చిన అమ్మాయి తండ్రి, రియల్టర్ మారుతీరావును వెంటనే అరెస్ట్ చేయాలంటూ ర్యాలీ నిర్వహించాయి. ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు మారుతీరావు ఇంటివద్ద భారీ భద్రతను ఏర్పాటుచేశారు. కుమార్తె ఇష్టంలేని పెళ్లిచేసుకోవడంతో ఆగ్రహించిన తండ్రి మారుతీరావు.. అల్లుడిని హత్య చేసేందుకు రూ.10 లక్షలు సుపారీ ఇచ్చినట్టు తెలుస్తోంది. 
 
ఇకపోతే.. ప్రణయ్‌ను చంపించింది డాడీనేనని అమృత తెలిపింది. మిర్యాలగూడలోని జ్యోతి ఆస్పత్రిలో అమృత చికిత్స పొందుతోంది. ప్రస్తుతం గర్భంతో వున్న తన నుంచి ప్రణయ్‌ని దారుణంగా తిరిగిరానీయకుండా చేశారని విలపించింది. తన కళ్ల ఎదుటే ప్రణయ్‌‌ను నరికి చంపించిన తన తండ్రిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసింది. హంతకుడు తన తండ్రైనా సరే ఉరి తీయాల్సిందే అని అమృత పట్టుబడుతోంది. 
 
తండ్రే భర్తను హత్య చేయిస్తాడని ఊహించలేదని అమృత వాపోయింది. ప్రేమించి పెళ్లాడిన తన భర్త ప్రణయ్ ఇక లేడనే విషయం తెలియగానే అతడి భార్య అమృత కన్నీరు మున్నీరుగా విలపించింది. ప్రణయ్‌ను చంపేందుకు చాలా రోజులుగా రెక్కీ నిర్వహించారని చెప్పింది. మా నాన్న ఆలోచనల గురించి మా అమ్మ ఎప్పటికప్పుడు చెప్పేది. అబార్షన్ చేయించుకోవాలని తండ్రి ఒత్తిడి తెచ్చినా.. తాను ఒప్పుకోలేదని.. గురువారం ఆస్పత్రికి వచ్చి తిరిగి వెళ్తున్న క్రమంలో ఓ వ్యక్తి వచ్చి క్షణాల్లో ప్రణయ్‌పై దాడి చేశాడు. 
 
దాడి చేసిన వ్యక్తి జీన్స్, వైట్ విత్ బ్రౌన్ కలర్ చెక్స్ షర్ట్ వేసుకుని వున్నాడని.. తమ పెళ్లిని తల్లిదండ్రులు అంగీకరించకపోవడంతో.. ఇంటి నుంచి వచ్చేశానని.. కోట్ల ఆస్తులు వద్దన్నా.. తండ్రి తన భర్తను హత్య చేశారని అమృత విలపించింది. ప్రణయ్‌పై ఎప్పటికప్పుడు తన తండ్రి నిఘా పెట్టేవారని.. ప్రణయ్ ఎక్కడున్న విషయం మా నాన్నకు క్షణాల్లో తెలిసేది. ఆ విషయాలు మా అమ్మ తనకు చెప్పేదని అమృత వెల్లడించింది. ఇప్పుడు తాను మా నాన్న వద్దకు వెళ్లనని.. మంచి భర్తను కోల్పోయానని అమృత బోరున విలపించింది. ఇప్పటికే అమృత తండ్రి మారుతీరావు, బాబాయిలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 
 
ఉన్నత కులానికి చెందిన అమృత, దళిత సామాజిక వర్గానికి చెందిన ప్రణయ్‌లు ఇంజనీరింగ్ చదివే రోజుల్లో ప్రేమలో పడ్డారు. పెళ్లి చేసుకోవాలని భావించిన ఈ జంట పెద్దలకు తమ ప్రేమ విషయం తెలియజేశారు. అయితే దళిత యువకుడికి తన కూతురినిచ్చి పెళ్లి చేయడానికి అమృత తండ్రి మారుతిరావు ఒప్పుకోలేదు. దీంతో తండ్రిని ఎదిరించి మరీ అమృత తాను ప్రేమించిన ప్రణయ్‌ని పెళ్లి చేసుకుంది. దీంతో వీరిపై కోపాన్ని పెంచుకున్న మారుతిరావు అల్లున్ని చంపడానికి కిరాయి హంతకులకు సుపారీ ఇచ్చినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

టికెట్ లేకుండా యువకుడి రైలు ప్రయాణం.. ఫైన్ కట్టాల్సింది పోయి.. ప్రాణాలు?