Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

చంద్రబాబు పిల్లనిచ్చిన మామ మరణానికే కారణమయ్యాడు: మంత్రి బొత్స

Advertiesment
చంద్రబాబు పిల్లనిచ్చిన మామ మరణానికే కారణమయ్యాడు: మంత్రి బొత్స
, బుధవారం, 2 డిశెంబరు 2020 (07:04 IST)
ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పై ఫైర్ అయ్యారు. అసెంబ్లీ సాక్షిగా తీవ్ర విమర్శలు గుప్పించారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే...
 
1. పార్టీలు, కులాలు, మతాలు, ప్రాంతాలు చూడకుండా 5 ఏళ్ళలో 25 లక్షల మంది పేదలకు ఇళ్ళ స్థలాలు ఇచ్చి, పక్కా ఇళ్ళు కట్టిస్తాం, అక్క చెల్లెమ్మల పేరుతో రిజిస్ట్రేషన్‌ చేస్తాం.. అని భగవద్గీతగా నమ్మే మా మేనిఫెస్టోలో చెప్పాం. ఇచ్చిన మాట ప్రకారమే 30.66 లక్షల ఇళ్ళ పట్టాలు, పక్కా ఇళ్ళు ఇవ్వాలని నిర్ణయించారు. ఇందులో 2.62 లక్షలు టిడ్కో ఇళ్ళు ఉన్నాయి. 
 
2. ఇళ్ళ పట్టాలకు సంబంధించి 68, 677.83 ఎకరాలు భూములు సేకరించాం. ఇన్ని లక్షల మందికి ఒకేసారి ఇళ్ళ పట్టాలు ఇవ్వడం రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ జరగలేదు.  దీని విలువ అక్షరాలా రూ. 23,500 కోట్లు. ఇందుకోసం 25,430.33 ఎకరాలు ప్రభుత్వ భూమి,  25,359.3 ఎకరాలు ప్రైవే ట్‌ భూములు సేకరించాం. ఇందుకోసం రూ.  8,840.40 కోట్లు కేటాయించాం. దీంట్లో  నూటికి 90 శాతం భూములు సేకరించి అంటే రూ. 7, 739 కోట్లు చెల్లించాం. 
 
3. పేదలకు పక్కా ఇళ్ళు అక్కచెల్లెమ్మల పేరుతోనే రిజిస్ట్రేషన్‌ చేసి ఇవ్వాలని మేం నిర్ణయిస్తే.. టీడీపీ, చంద్రబాబు దుష్ట ఆలోచన, దుర్మార్గమైన ఆలోచనతో, వాళ్ళకున్న పూర్వ పరిచయాలతో కోర్టులకెళ్ళి స్టేలు తెచ్చారు. నిరుపేదల సొంత ఇంటి కలను వీళ్ళు అడ్డుకున్నారు. దీనిపై ప్రభుత్వం న్యాయస్థానాల్లో పోరాటం చేస్తుంది.

ముఖ్యమంత్రి పట్టుదల ఒక్కటే, ఎంత కష్టమైనా పేదలకు ఇళ్ళ పట్టాలు ఇచ్చి, పక్కా ఇళ్ళు నిర్మించాలన్నదే. అందుకే, మేం మేనిఫెస్టోను ఏవిధంగా అయితే భగవద్గీతగా, బైబిల్‌ గా, ఖురాన్‌ గా భావిస్తామో అలానే డిసెంబరు 25న వైకుంఠ ఏకాదశి పర్వదినాన, మరోవైపు క్రిస్మస్‌ రోజున ఇళ్ళ స్థలాల పట్టాలు ఇస్తున్నాం. 
 
4. ప్రభుత్వం అక్క చెల్లెమ్మల పేరున సేల్‌ డీడ్‌ ఇచ్చి ఇళ్ళ పట్టాలు ఇవ్వాలన్న  ఉద్దేశానికి కోర్టులకెళ్ళి వీళ్ళు తూట్లు పొడిచారు. అలానే, 15.60 లక్షల పక్కా ఇళ్ళు  నిర్మాణానికి శంకుస్థాపన మొదలు పెడుతున్నాం. చంద్రబాబేమో గత 5 ఏళ్ళు అధికారంలో ఉండి..  టిడ్కో హౌసింగ్‌ అని, పెద్ద టెక్నాలజీ, షేర్‌ వాల్‌ టెక్నాలజీ అని కబుర్లు చెప్పాడు. ఏ ఒక్క ఇల్లు కూడా పూర్తి చేయలేదు. 
 
5. టీడీపీ హయాంలో 2015–18 మధ్య కాలంలో 7,01,481 ఇళ్ళు కేంద్రం మంజూరు చేస్తే.. 5 లక్షల ఇళ్ళకు మాత్రమే 2017–18లో పరిపాలనాపరమైన అనుమతులు∙ఇచ్చి 4.54 లక్షలకే టెండర్లు పిలిచారు. వీటిలో 3.09 లక్షలు మాత్రమే నిర్మాణం ప్రారంభించారు. అయితే చంద్రబాబు హయాంలో ఒక్క ఇల్లు అంటే ఒక్క ఇల్లు కూడా ప్రారంభించలేదు. ఏ ఒక్కరికీ ఇల్లు ఇవ్వలేదు.

అలాంటి చంద్రబాబు, ఈరోజు ప్రతిపక్షంలో కూర్చుని పేదలకు ఇళ్ళు ఇవ్వాలని, లేకుంటే ఆక్రమించాలని  మాట్లాడతాడు. కనీసం ఆయన హయాంలో నిర్మించిన ఇళ్ళకు మంచినీటి కుళాయి, మరుగునీటి సౌకర్యం, కరెంటు సౌకర్యం లేకుండా ఏ ఒక్కరికీ ఒక్క ఇల్లు కూడా కేటాయించలేదు. అదే చంద్రబాబును నేరుగా ప్రశ్నిస్తున్నాం.  మీ ఇంటికి మాత్రం తాగునీటి కుళాయి ఉండాలి, మరుగు నీటి సౌకర్యం ఉండాలి, కరెంటు సౌకర్యం ఉండాలిగానీ... పేదవాడికి ఉండకూడదా..? ఇదెక్కడి న్యాయం?
 
6. చంద్రబాబు హయాంలో టిడ్కో ఇళ్ళకు సంబంధించిన వివరాలు చూస్తే.. కనీస మౌలిక సౌకర్యాలు ఏర్పాటు చేయకుండానే తయారైన అంటే 90 శాతం పూరై్తన ఇళ్ళు  300 చ.అడుగుల ఇళ్ళు 39,617 మాత్రమే. అలానే, 365 చ. అడుగుల ఇళ్ళు 13,614, 

430 చ. అడుగుల ఇళ్ళు 24, 140.  అంటే మొత్తం 77,371 మాత్రమే 90 శాతం పూర్తి అయింది. ప్రజలు చంద్రబాబుకు 5 ఏళ్ళు పరిపాలించమని అవకాశం ఇస్తే.. అవిచేస్తాం.. ఇవి చేస్తాం.. ఉద్దరిస్తామని చెప్పారు. ఎందుకు సద్వినియోగం చేసుకోలేకపోయారు? మీ టెక్నాలజీ ఏమైంది? దేనికోసం మీరు కక్కుర్తి పడింది, కమీషన్ల కోసమా, టెండర్ల కోసమా.. ?
 
7. మిగతా ఇళ్ళు 75 శాతం లోపు..  బేస్‌ మెంటు లోపల ఉన్నాయి. వీటిపై రివర్స్‌ టెండరింగ్‌ కు వెళ్ళాం. ఈ ఇళ్ళకు సంబంధించి.. చంద్రబాబు విధానంలో వెళితే, 300 చదరపు అడుగుల ఇళ్ళ విలువ రూ. 6,55,000 ఉంటే.. లబ్ధిదారుడు 2,65,000 కట్టాలి, అలానే 365 చ. అడుగుల ఇంటి విలువ రూ. 7,55000 ఉంటే, లబ్ధిదారుడు రూ3, 65,000 కట్టాలి, 430 చ. అడుగులు ఇంటి విలువ రూ. 8,55000 ఉంటే, లబ్ధిదారుడు రూ. 4,65,000 20 ఏళ్ళ పాటు కట్టుకోవాలి.

అంటే అద్దె ఇంటిలో ఉన్నట్టే, 20 ఏళ్ళు కిస్తీలు కట్టేటప్పటికీ వాళ్ళ జీవితం పోతుంది. ఇళ్ళు కట్టకుండా, కేవలం మొబిలైజేషన్‌ అడ్వాన్సుల్లో కమీషన్లు కొట్టేయాలన్నదే ఆలోచనతో టీడీపీ ప్రభుత్వం ఈ విధంగా దుర్మార్గంగా వ్యవహరించింది. 
 
8. జగన్‌ మోహన్‌ రెడ్డిగారు అధికారంలోకి వచ్చేనాటికి టిడ్కో ఇళ్ళకు సంబంధించి రూ. 3 వేల కోట్లకు పైగా బకాయిలు ఉన్నాయి. వాటికి సంబంధించి ఎస్‌ఎఫ్‌ టీ ధర చూస్తే.. రూ.  1735 నుంచి 2028 కు పైగా టీడీపీ ప్రభుత్వం ఫిక్స్‌ చేసింది.

దానిపై మేం రివర్స్‌ టెండరింగ్‌ కు వెళితే మా హయాంలో చదరపు అడుగుకి రూ. 1630 కు తగ్గింది. మొత్తం రూ. 3,239 కోటు అగ్రిమెంటు కుదుర్చుకున్న 63,744 యూనిట్ల నిర్మాణాలకు సంబంధించి రివర్స్‌ టెండరింగ్‌ వేస్తే ప్రభుత్వానికి రూ. 392 కోట్లు ఆదా వచ్చింది. ప్రస్తుతం 2.62 లక్షల ఇళ్ళ నిర్మాణం పనులు వివిధ దశల్లో ఉన్నాయి. 
 
9. ఈ ప్రభుత్వం 300 చ. అడుగుల ఇళ్ళు ఉచితంగా, అంటే ఒక్క రూపాయికే ఇస్తున్నాం. అటువంటి ఆలోచన చంద్రబాబుకు ఎప్పుడైనా వచ్చిందా..?  ఆ మనసు చంద్రబాబుకు లేదు, ప్రజల పట్ల తపనగానీ, బాధ్యతగానీ లేదు. 
 
10. వైయస్‌ఆర్‌ ఆరోజు వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌ ఇస్తానంటే.. ఉచిత విద్యుత్‌ ఇస్తే,  కరెంటు తీగల మీద బట్టలు ఆరేసుకోవాలని చంద్రబాబు చెప్పాడని కౌన్సిల్‌ లో చెబితే.. వాళ్ళ అబ్బాయి లోకే ష్‌ కి పొడుసుకొచ్చింది, ఆ సభలో ఇది రికార్డు అయింది. మా మేనిఫెస్టో ఫేక్‌ అంటారా..? జనంలోకి వెళితే ప్రజలే బుద్ధి చెబుతారు. చంద్రబాబు ఒక ఫేక్, ఆయన ఆలోచనలు ఫేక్, ఆయన రాజకీయ విధానమే ఫేక్‌.. తప్పుడు విధానాలు, వక్ర బుద్ధి చంద్రబాబుది.

నా చరిత్ర ఏం చెబుతావ్‌ చంద్రబాబూ.. ఆయన లాంటి వెన్నుపోటు చరిత్ర నాకు లేదు. ఇంట్లో ఉన్న తండ్రిని, తండ్రి సమానమైన పిల్ల నిచ్చిన మామను చంపాలన్న దౌర్భాగ్యమైన ఆలోచనలు మేం చేయం. పిల్లనిచ్చిన మామ దైవ స్వరూపం. చంద్రబాబుకు ఉచ్ఛం, నీచం లేదు. పేదలకు ఇళ్ళు ఇస్తామంటే అడ్డుకోవడం ధర్మమేనా.. ?
 
11. ఇవాళ ఈ ప్రభుత్వం మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో..  99 శాతం కేవలం 18 నెలలకాలంలో అమలు చేసింది. ఆంధ్రప్రదేశ్‌ చరిత్రలో ఇదొక చరిత్ర. మేం ఇంత పెద్ద ఎత్తున ఇళ్ళు ఒకేసారి కట్టడం కష్టం, దశల వారీగా నిర్మిద్దాం అని చెప్పినా, ముఖ్యమంత్రి జగన్‌ పేదల కోసం ఒక మహా యజ్ఞాన్ని ప్రారంభించారు.

తన సంకల్పానికి అడ్డు పెట్టవద్దని జగన్‌ గారు కేబినెట్‌ మంత్రుల్ని కూడా ఒప్పించారు. ఏరోజు అయినా చంద్రబాబు ఇన్ని లక్షల మందికి ఇళ్ళ స్థలాలుగానీ, పక్కా ఇళ్ళు గానీ నిర్మించే ఒక్క మంచి కార్యక్రమం ఒక్కటంటే ఒక్కటి చేశారా..?
 
12. అమరావతి మీద కూడా చర్చ పెడితే.. చంద్రబాబు ఎటువంటి ద్రోహం చేశాడో చెబుతాం. అమరావతిలో పేదలకు ఇళ్ళ స్థలాలు  ఇస్తే.. కోర్టు కెళ్ళి స్టేలు తెస్తారా.. ? అక్కడ ఒకే సామాజిక వర్గం ఉండాలా..? పేదలు అక్కడ ఉంటే సామాజిక అసమతౌల్యం వస్తుందా.. ? ఎస్సీలు, బీసీలు, మైనార్టీలు ప్రజాస్వామ్యంలో భాగస్వామ్యం కాదా.. ? ఇదేనా రాజకీయాల్లో మీకు ఇంత అనుభవంతో ఇచ్చే సందేశం.. ?
 
13. పేదల ఇళ్ళ పట్టాల అంశాల్లో..  కోర్టులకు వెళ్ళి అడ్డుపడిన వారిని ఇప్పటికైనా విత్‌ డ్రా చేసుకుని పేదలకు సేల్‌ డీడ్‌ తో పట్టాలు ఇచ్చే అవకాశం కల్పించండి. మంచి చేయాలని సంకల్పిస్తే.. దేవతలు సైతం తదాస్తు అంటారు. చంద్రబాబు, ఇప్పటికైనా తాను చేసిన తప్పు సరిదిద్దుకుంటే ప్రజలు క్షమిస్తారు. లేకపోతే చరిత్రహీనుడిగా, ఒక ద్రోహిగా మిగిలిపోతారు. 
 
14. రాజశేఖరరెడ్డి హయాంలో ఇళ్ళ నిర్మాణంలో అక్రమాలు జరిగితే.. అప్పుడు మంత్రిగా ఉన్న తనపై ఏ ఒక్క ఎలిగేషన్‌ అయినా చేశారా.. ? చంద్రబాబు అబద్ధాలు చెప్పి కాలయాపన చేస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అందరికీ కరోనా వ్యాక్సిన్‌ అవసరం లేదు: కేంద్రం