Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఓటీఎస్‌పై అవంతి శ్రీనివాస్ క్లారిటీ: బాబు మోసపూరిత ప్రకటనల్ని నమ్మొద్దు

ఓటీఎస్‌పై అవంతి శ్రీనివాస్ క్లారిటీ: బాబు మోసపూరిత ప్రకటనల్ని నమ్మొద్దు
, బుధవారం, 8 డిశెంబరు 2021 (10:45 IST)
జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకంలో భాగంగా 1983 నుంచి 2011 ఆగస్టు 15 వరకు గృహ నిర్మాణ సంస్థ నుంచి రుణం పొంది, లేదా ప్రభుత్వ స్థలంలో ఇల్లు నిర్మించుకున్న లబ్ధిదారులకు యాజమాన్య హక్కులు కల్పించాలని నిర్ణయించిన జగన్ సర్కార్ ఈ పథకంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా గతంలో లబ్ధి పొందిన లబ్ధిదారుల నుండి నాటి రుణాలను వన్ టైం సెటిల్మెంట్ పేరుతో చెల్లిస్తే లబ్ధిదారులకు ఇంటిపై హక్కు పత్రాలను రిజిస్ట్రేషన్ చేసి ఇస్తామని వెల్లడించింది. అయితే ఈ ఓటీపీ ప్రస్తుతం రగడ మొదలైంది. 
 
ప్రస్తుతం ఓటీఎస్‌పై అవంతి శ్రీనివాస్ మరోమారు క్లారిటీ ఇచ్చారు. ఓటీఎస్‌పై ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి కడుతున్నారని ఎవరినీ బలవంతం పెట్టడం లేదన్నారు. ఓటీఎస్ కట్టని వారికి సంక్షేమ పథకాలు నిలిపి వేస్తారని ప్రచారం అవాస్తవమని స్పష్టం చేశారు. సంక్షేమ పథకాలను మింగుడుపడని కొందరు కావాలని ద్రుష్పచారం చేస్తున్నారని, ఓటీఎస్‌పై రాజకీయాలు చేయడం సరికాదని ఆయన హితవు పలికారు. 
 
ఓటిఎస్‌పై ఏపీ మాజీ సీఎం చంద్రబాబు చేస్తున్న మోసపూరిత ప్రకటనలు నమ్మొద్దని, చంద్రబాబు అధికారంలోకి వస్తే ఫ్రీగా రిజిస్ట్రేషన్లు చేస్తామని అంటున్నారని మరి పదునాలుగు ఏళ్లు సీఎంగా ఉన్నప్పుడు ఎందుకు చేయలేదంటూ ప్రశ్నించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గుంటూరులో ఐ.టి. కలకలం... సక్కు గ్రూపు సంస్థలపై దాడులు..