Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రెడ్‌జోన్ ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ మ‌రింత ప‌టిష్టం: విజ‌య‌వాడ పోలీస్ క‌మిష‌న‌ర్

Advertiesment
రెడ్‌జోన్ ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ మ‌రింత ప‌టిష్టం: విజ‌య‌వాడ పోలీస్ క‌మిష‌న‌ర్
, ఆదివారం, 19 ఏప్రియల్ 2020 (23:11 IST)
ఎన్న‌డూ చూడ‌ని క‌రోనా వైర‌స్ వంటి విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో న‌గ‌ర‌లోని రెడ్ జోన్ ప‌రిధిలో విధించిన లాక్‌డౌన్‌ను మ‌రింత ప‌టిష్టంగా అమ‌లుచేస్తామ‌ని విజ‌య‌వాడ న‌గ‌ర పోలీస్ క‌మిష‌న‌ర్ సీహెచ్ ద్వార‌కా తిరుమ‌ల‌రావు అన్నారు.

ఆదివారం న‌గ‌రంలోని రెడ్‌జోన్ ప్రాంతాలైన విద్యాధరపురం, పాత రాజరాజేశ్వరిపేట, రాణిగారితోట, ఖుద్దూస్‌నగర్, పాయకాపురం, సనంత్‌నగర్‌లో అంతర్గత వీధుల్లో వాహనాల రాకపోకలను నియంత్రించ‌డంతో పాటు లాక్‌డౌన్ సంపూర్ణ౦గా అమలు జరిపేందుకు అన్ని వీధులు కవర్ చేసే విధంగా ప్రతి రెడ్‌జోన్‌లోను ఒక ద్విచక్ర వాహనం మరియు చతుశ్చక్ర వాహనాలను రెడ్‌జోన్ ప్రాంత‌మైన విద్యాధరపురం నందు ప్రారంభి౦చారు.

అలాగే వాహన సిబ్బందికి ర‌క్ష‌ణ కిట్‌ల‌ను అంద‌జేశారు. ఈ సందర్భంగా సీపీ ద్వారకా తిరుమలరావు మాట్లాడుతూ విజయవాడ నగరంలో ఉన్న అన్ని రెడ్‌జోన్ ప్రాతాలలో లాక్‌డౌన్‌ను ఖచ్చితంగా అమలు చేసేందుకుగాను పోలీస్ పరంగా విస్తృత చర్యలు చేపట్టామన్నారు.

అందులో భాగంగానే రెడ్‌జోన్ అంతర్గత వాహన నియంత్రణ పోలీస్ వాహనాలను ప్రారంభించడం జరిగిందని. అలానే రెడ్ జోన్ ప్రాంతాలలో డ్రోన్ కెమెరాల సాయంతో అంతర్గత౦గా ప్రజల కదలికలను నియంత్రిచడం జరిగిందని తెలిపారు. ఎవరైతే రెడ్ జోన్ ప్రాంతాలలో పనిచేస్తున్న పోలీసు సిబ్బంది ఆరోగ్య పరిరక్షణకు అన్ని చర్యలు చేప‌ట్టామ‌ని తెలిపారు.

అందులో భాగంగా విటమిన్ టాబ్లెట్స్, మాస్క్‌లు, చేతి గ్లౌవ్స్, పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్మెంట్ అందించారు. విజయవాడ నగరంలో లాక్‌డౌన్ కచ్చితంగా అమలు జరుపుతున్నామని, రైతుబజార్‌ల వ‌ద్ద నిత్యావసరాలు కొనుగోలు చేసే దుకాణాల ఎదుట ప్ర‌జ‌లు భౌతిక దూరం తప్పనిసరిగా పాటించాల‌ని కోరారు.

కార్యక్రమంలో అదనపు పోలీస్ కమిషనర్ శ్రీనివాసులు, ఐజీ సత్యనారాయణ, డీసీపీ విక్రాంత్‌పాటిల్, హర్షవర్ధన్, మేరీ ప్రశాంతి, కోటేశ్వరరావు, పశ్చిమ మండల ఏసిపి సుధాకర్, మరియు ఇతర ఏసీపీలు, భవానీపురం సిఐ మోహన్‌రెడ్డి త‌దిత‌రులు పాల్గొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కంటైన్ మెంట్ జోన్లలో ఎలాంటి మినహాంయిపులు ఉండవు: లవ్ అగర్వాల్