Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అబ్బే.. 'స్థానిక పోరు' నిర్ణయంపై ఇపుడు స్టే ఇవ్వలేం : ఏపీ హైకోర్టు

Advertiesment
Local Body Election
, మంగళవారం, 8 డిశెంబరు 2020 (12:20 IST)
ఆంధ్రప్రదేశ్ సర్కారుకు ఆ రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానంలో మరోమారు చుక్కెదురైంది. ఫిబ్రవరిలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలన్న రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయంపై స్టే ఇవ్వాలంటూ ఏపీ సర్కారు చేసిన విజ్ఞప్తిని హైకోర్టు తోసిపుచ్చింది. 
 
కాగా, గత మార్చి నెలలో ఏపీలో పంచాయతీ ఎన్నికల ప్రక్రియను ప్రారంభించారు. అనేక ప్రాంతాల్లో ఏకగ్రీవంగా అనేక మంది ఎన్నికయ్యారు కూడా. అయితే, కరోనా మహమ్మారి కారణంగా ఈ ఎన్నికలను వాయిదా వాయిదా వేశారు. ఆ తర్వాత ఈ ఎన్నికల కోసం జారీచేసిన నోటిఫికేషన్ కూడా రద్దు అయింది. 
 
ఈ క్రమంలో వచ్చే యేడాది ఫిబ్రవరిలో పంచాయతీ పోల్స్ నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తోంది. అయితే ఎన్నికల కమిషనరు నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఏకపక్షంగా ఈ నిర్ణయం తీసుకున్నారని, అందువల్ల ఈ ఎన్నికల నిర్వహణ నిర్ణయంపై స్టే ఇవ్వాలంటూ హైకోర్టులో ఏపీ సర్కారు నోటిఫికేషన్ జారీచేసింది. 
 
దీన్ని విచారణకు స్వీకరించిన హైకోర్టు.. స్థానిక ఎన్నికల ప్రక్రియను ప్రస్తుత పరిస్థితుల్లో నిలుపుదల చేయలేమని వ్యాఖ్యానించింది. స్టే ఇవ్వడం సాధ్యం కాదని తేల్చి చెప్పింది. కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా ఎన్నికల కమిషనర్‌ను హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ ఈనెల 14కు వాయిదా వేసింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తెలంగాణలో పెరిగిపోతున్న కరోనా కేసులు.. ముగ్గురు మృతి