తిరుమల శ్రీవారి మెట్ల మార్గంలో చిరుత పులి సంచారం మరోమారు కలకలం సృష్టించింది. నడక దారిన వెళుతున్న కొంతమంది భక్తులు చిరుతను చూసినట్టు చూశారు. ఇది బాగా ప్రచారం కావడంతో కలకలం రేపింది. ఈ విషయం తెలుసుకున్న అధికారులు, తిరుమల అటవీ సిబ్బంది అప్రమత్తమై తగిన చర్యలు చేపట్టారు.
మెట్ల మార్గంలో నడిచి వెళ్లే భక్తులు గుంపులు గుంపులుగా వెళ్లేలా అనుతించాలని నిర్ణయించారు. ఒంటరిగా వెళ్లే భక్తులపై చిరుత దాడి చేసే అవకాశం ఉండటంతో భద్రతా సిబ్బంది వాటర్ హౌస్ వద్ద భక్తులను నిలిపివేస్తున్నారు. అక్కడ నుంచి భక్తులు గుంపులుగా వెళ్లేందుకు అనుమతిస్తున్నారు.
మెట్ల దారి పక్కనే ఉన్న రోడ్డుపై చిరుత కనిపించిందని పులివెందులకు చెందిన భక్తులు తెలిపారు. వేగంగా రోడ్డు దాటుతున్న చిరుతను తాను చూసినట్టు చెప్పాడు. దీంతో వెంటనే ఫోన్ ద్వారా తిరుమల తిరుపతి దేవస్థాన అధికారులకు సమాచారం చేరవేసినట్టు చెప్పారు.