Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మిలటరీ విశ్రాంత ఉద్యోగిని మోసం చేసిన కిలాడీ నకిలీ డాక్టర్

మిలటరీ విశ్రాంత ఉద్యోగిని మోసం చేసిన కిలాడీ నకిలీ డాక్టర్
, బుధవారం, 10 నవంబరు 2021 (17:30 IST)
తాడేపల్లి  ఇప్పటం గ్రామాంలో  నివాసం ఉంటూ మిలటరీ లో పనిచేస్తున్న కార్తీక్ అనే వ్యక్తి ఆరోగ్య పరిస్థితి అంత బాగా లేక పోవడంతో కొంతకాలం నుంచి ఇంటి వద్దే ఉంటున్నాడు.

ఫిజియోథెరపీ డాక్టర్ పేరుతో పరిచయమై తన భార్యకు వైద్య సేవలు అందిస్తూ గతకొంతకాలంగా వారికి వారి పిల్లలకు దగ్గరైంది. పెద్ద హాస్పిటల్ పెట్టబోతున్నాం కోటిన్నర లోను వస్తందని  చెప్పడంతో ఆమెను నమ్మి దాదాపు 60 లక్షల వరకు నగదు, పది లక్షల వరకు బంగారం మరియు సొంత ఇంటి కాయితాలు కూడా తాకట్టు పెట్టింది మరి మోసం చేసిన మహిళ.

మంగళగిరిలో రోజా హాస్పిటల్స్ పేరుతో హాస్పిటల్ నిర్వహిస్తూ పరిసర ప్రాంతాల్లో ఫిజియోథెరపిస్ట్ గా పని చేస్తున్నా రోజా అనే మహిళ సాక్షాత్తూ మిలటరీ కుటుంబాన్ని మోసం చేయడం సంచలనంగా మారింది. 

ఆ కుటుంబం నుంచి డబ్బులు తీసుకోవడమే కాక ఇంటి కాయితాలు తాకట్టు పెట్టింది. మరి చివరకు నాకేం తెలియదు అనడంతో ఆ కుటుంబం రోడ్డున పడింది. 

తీరా చూస్తే పెదకాకాని ఎస్.ఐ వినోద్ కుమార్ తో గత కొద్ది సంవత్సరాలుగా ప్రేమలో ఉన్న ఆమె గత సంవత్సరం పెళ్లి చేసుకోవడంతో అక్కడి నుంచి వేధింపులు మొదలయ్యాయి. 

వారు డబ్బులు ఇవ్వకపోగా అప్పులు చేస్తే ఇవ్వాల్సిన రూలేమీ లేదంటూ మీకు చేతనైన చేసుకోండి అంటూ ఎస్సై వినోద్ కుమార్ మాట్లాడటం తో బాధితులు దిక్కులేని పరిస్థితుల్లో పోలీసులను ఆశ్రయించారు. 

సంపాదించినదంతా పోవడంతో ఆ కుటుంబం మాకు ఆత్మహత్య తప్ప మరో మార్గం లేదు అంటూ కన్నీటి పర్యంతమయ్యారు. 

మిలటరీలో సేవలందించి దాచుకున్న డబ్బు మహిళ కాజేయటంతో పాటు ఎస్సై వినోద్ కుమార్ నుంచి బెదిరింపులు  రావడంతో దిక్కుతోచని స్థితిలో కార్తీక్ కుటుంబం ఉంది. 

పెళ్ళికి ముందే ప్రేమలో ఉంటూనే వినోద్ కుమార్ ఆమెతో కలసి మోసానికి పాల్పడినట్లు బాదితులు ఆరోపణ. పోలీసులు తమకు న్యాయం చేసి ఆదుకోవాలని వారు కోరుతున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సామూహిక అత్యాచారం కేసులో ఐదురికి జీవిత ఖైదు