Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కృష్ణపట్నం ఇండస్ట్రియల్ నోడ్ అభివృద్ధికి రూ. 1,448 కోట్లు

కృష్ణపట్నం ఇండస్ట్రియల్ నోడ్ అభివృద్ధికి రూ. 1,448 కోట్లు
, శుక్రవారం, 11 జూన్ 2021 (22:08 IST)
ఏపీఐఐసీ మరియు ఎన్ఐసీడీఐటీ లు సంయుక్తంగా చెన్నై బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ పరిధిలోని కృష్ణపట్నం ఇండస్ట్రియల్ నోడ్ ని అభివృద్ధి చేసి, మౌలిక వసతులు కల్పించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జాయింట్ ఎస్పీవీ (స్పెషల్ పర్సప్ వెహికిల్) ఏర్పాటు చేశారని ఇందుకు సంబంధించి జీవో నెంబర్ 30 ఇండస్ట్రీస్ మరియు కామర్స్ (ఇన్ ఫ్రా) తేదీ,11.05.2021  ద్వారా రూ .1,448 కోట్లకు ప్రభుత్వం పరిపాలనా అనుమతి ఇచ్చినట్లు ఏపీఐఐసీ వీసీ మరియు ఎండీ జె. సుభ్రమణ్యం  శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.
 
సుమారు 2,500 ఎకరాల విస్తీర్ణంలో అభివృద్ధి పనులు చేపట్టడం ద్వారా 2040 నాటికి ఆహార ప్రాసెసింగ్,  ఆటోమొబైల్ మరియు ఆటో విడి భాగాలు,  వస్త్ర మరియు దుస్తుల తయారీ పరిశ్రమలు, కెమికల్,  ఫార్మాస్యూటికల్,  ఎలక్ట్రికల్ పరికరాల తయారీ మరియు కంప్యూటర్ ఎలక్ట్రానిక్స్, ఆప్టికల్ ఉత్పత్తుల వల్ల ఈ ప్రాంతం వేగవంతంగా అభివృద్ధి చెందడం వలన పారిశ్రామిక రంగంలో 1 మిలియన్ ప్రత్యక్ష మరియు పరోక్ష ఉద్యోగాలు సృష్టించబడతాయన్నారు.
 
రోడ్లు, వంతెనలు, యుటిలిటీస్, ఎస్‌టిపి( సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్), సిఈటిపి (కామన్ ఎప్లూయంట్ ట్రీట్మెంట్ ప్లాంట్) మరియు ఘన వ్యర్థ పదార్థాల నిర్వహణ, పరిపాలనా భవనం,  విద్యుత్ సరఫరా వ్యవస్థ మరియు నీటి సరఫరా వ్యవస్థలతో కూడిన ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలతో కృష్ణపట్నం ఇండస్ట్రియల్ నోడ్‌ను అభివృద్ధి చేయనున్నారని తెలిపారు.
 
అంచనా వ్యయం మొత్తం రూ .1,448 కోట్లకు సంబంధించిన టెండర్ డాక్యుమెంట్ ను, సాధారణ ప్రజల కోసం జ్యుడిషియల్ ప్రివ్యూ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయబడిందని, ఆసక్తిగల వారు తమ వ్యాఖ్యలను మరియు సలహాలను ఏడు పని దినాలలో, ఈ క్రింది తెలిపిన వెబ్‌సైట్ లేదా ఈ-మెయిల్ ద్వారా అందించవచ్చని వీసీ మరియు ఎండీ జే. సుభ్రమణ్యం తెలియజేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రైతాంగానికి వెన్నుదన్నుగా నిలిచేలా చర్యలు: డిఐజి రంగనాధ్