Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

లక్ష్మీ నారాయణ పార్టీ పేరు 'జనధ్వని' (జేడీ)

Advertiesment
లక్ష్మీ నారాయణ పార్టీ పేరు 'జనధ్వని' (జేడీ)
, శనివారం, 24 నవంబరు 2018 (09:54 IST)
సీబీఐ మాజీ జాయింట్ డెరెక్టర్ లక్ష్మీనారాయణ కొత్తగా రాజకీయ పార్టీని పెట్టనున్నారు. ఈనెల 26వ తేదీన ఈయన పార్టీ విధి విధానాలతో పాటు పార్టీ జెండాను వెల్లడించే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో ఆయన ఏర్పాటు చేసే పార్టీ పేరు ఏమైవుంటుందన్న చర్చ రాజకీయ వర్గాల్లో ఆ సక్తికరంగా సాగుతోంది. 
 
ఈ నేపథ్యంలో జేడీగా ప్రతి ఒక్కరికీ పరిచయమైన లక్ష్మీనారాయణ తన పార్టీ పేరు కూడా... అలాగే స్ఫురించేలా 'జన ధ్వని' (జేడీ) అని పెట్టవచ్చనే ప్రచారం సాగుతోంది. 'వందేమాతరం' అనే పేరు సైతం ప్రచారంలో ఉంది. లక్ష్మీనారాయణ సన్నిహిత వర్గాలు మాత్రం ఏ పేరునూ ధ్రువీకరించటం లేదు. అలాగని వీటిని ఖండించటమూ లేదు. 
 
జేడీ పేరు పైనే లక్ష్మీనారాయణ ఆసక్తి చూపుతున్నట్లు భావిస్తున్నారు. ఈనెల 26వ తేదీన ఆయన పార్టీ ఏర్పాటు ప్రకటన చేసేందుకు హైదరాబాద్‌లోని పబ్లిక్‌ గార్డెన్స్‌ వేదిక కానున్నట్లు తెలిసింది. ఈ సమావేశానికి ఇప్పటికే కొంతమందికి ఆహ్వానాలు పంపినట్లు సమాచారం. పార్టీ పేరు ఏముంటే బాగుంటుందో చెప్పాలంటూ ఆ భేటీకి హాజరయ్యే వారి నుంచి అభిప్రాయ సేకరణ కూడా చేసే అవకాశముందని అంటున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మాకు ఏమైనా జరిగితే బాధ్యత డీజీపీదే : పవన్ హెచ్చరిక