Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మోడీ - షా ద్వయం ఉచ్చులో చంద్రబాబు : జేసీ దివాకర్ రెడ్డి

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఉచ్చులో టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చిక్కుకుని ఉన్నారనీ, ఆ ఉచ్చును తప్పించుకుని చంద్రబాబు బయటకు రాలేకపోతున్నారనీ అనంతపురం టీడీపీ ఎంపీ జేస

Advertiesment
మోడీ - షా ద్వయం ఉచ్చులో చంద్రబాబు : జేసీ దివాకర్ రెడ్డి
, శుక్రవారం, 2 మార్చి 2018 (12:29 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఉచ్చులో టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చిక్కుకుని ఉన్నారనీ, ఆ ఉచ్చును తప్పించుకుని చంద్రబాబు బయటకు రాలేకపోతున్నారనీ అనంతపురం టీడీపీ ఎంపీ జేసీ.దివాకర్ రెడ్డి అన్నారు. 
 
ఆయన శుక్రవారం ఓ టీవీ ఛానెల్‌తో మాట్లాడుతూ, చంద్రబాబు పెద్దమనిషి తరహాలో ప్రత్యేక హోదా బదులు ప్యాకేజీ ఇస్తానంటే ఒప్పుకున్నారని, అది కూడా ఇవ్వకుంటే చూస్తూ ఊరుకోబోయేదిలేదని అన్నారు. అదేసమయంలో వైకాపా ఎంపీలే కాదు.. టీడీపీ ఎంపీలు రాజీనామా చేసినా కేంద్రం తలొగ్గే ప్రసక్తే లేదన్నారు. 
 
అయినప్పటికీ ఇక ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనన్నదే తమ ప్రధాన డిమాండని తేల్చిచెప్పారు. ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు తలచుకుంటే ఏ పనైనా జరుగుతుందని అభిప్రాయపడిన ఆయన, రాష్ట్రానికి రావాల్సిన హామీల అమలుకు పోరాటం చేస్తామని హామీ ఇచ్చారని జేసీ గుర్తుచేశారు. 
 
అలాగే, మరో ఎంపీ తోట నరసింహం మాట్లాడుతూ విభజన హామీల అమలుపై కేంద్ర ప్రభుత్వం స్పందించకుంటే ఏదో ఒక నిర్ణయం తప్పదని హెచ్చరించారు. ఆయన శుక్రవారం అమరావతిలో స్పందిస్తూ, కేంద్రప్రభుత్వం మేం అనుకున్న రీతిలో స్పందించడం లేదన్నారు. ప్రత్యేక ప్యాకేజీ, రెవెన్యూలోటు, రైల్వేజోన్‌పై చర్చించేందుకు స్థానిక అధికారులను కేంద్రం పిలిచినట్టు తెలుస్తోందని ఎంపీ నరసింహం అన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మావోయిస్టు అగ్రనేత హరిభూషణ్ ఎన్‌కౌంటర్