Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అమరావతిలో ఎమ్మెల్యేలకు స్థలాలిస్తే అమ్ముకుంటారు... జేసీ షాకింగ్ కామెంట్స్

జేసీ దివాకర్ రెడ్డి సంగతి తెలియనిదేముంది... నోరు తెరిచి చెప్పాలని ఒకటనుకున్నారంటే.... ప్రపంచం తలకిందులైనా తను చెప్పాల్సింది చెప్పాస్తారంతే. తాజాగా మరో వ్యాఖ్య చేసి తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఇరకాటంలో పె

Advertiesment
JC Diwakar reddy
, సోమవారం, 17 ఏప్రియల్ 2017 (15:27 IST)
జేసీ దివాకర్ రెడ్డి సంగతి తెలియనిదేముంది... నోరు తెరిచి చెప్పాలని ఒకటనుకున్నారంటే.... ప్రపంచం తలకిందులైనా తను చెప్పాల్సింది చెప్పేస్తారంతే. తాజాగా మరో వ్యాఖ్య చేసి తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేశారు. ఇంతకీ విషయం ఏంటయా అంటే... పురపాలక శాఖామంత్రి నారాయణ కర్నూలు జిల్లా పర్యటనకు వచ్చారు. ఆ సందర్భంగా టీజీ, ఎస్వీలతో ఆయన ఇళ్ల పథకాల అమలుపై చర్చిస్తున్నారు. ఐతే విషయం తెలుసుకున్న జేసీ దివాకర్ రెడ్డి అక్కడ ప్రత్యక్షమయ్యారు. ఇంకేముంది మాటల తూటాలు పేలాయి.
 
జేసీ మాట్లాడుతూ...  అమరావ‌తి అభివృద్ధిపై సీఎం చంద్ర‌బాబుకే కాదు మీక్కూడా అవగాహన లేదేమోననిపిస్తుందంటూ విమర్శ చేశారు. అంతేకాదు... అమ‌రావ‌తి అభివృద్ధి చెందాలంటే ఎంపీలు, ఎమ్మెల్యేల‌కు అక్క‌డే ఇళ్ల స్థ‌లాలివ్వాలని చెపుతూనే ఆ స్థలాల‌ను బ్యాంకులతో లింకప్ చేయాలని సూచించారు. ఐతే ఆ తర్వాత మళ్లీ మాట్లాడుతూ... బ్యాంకులకు లింకప్ చేయనట్లయితే ఎమ్మెల్యేలు చక్కగా ఆ స్థలాలను వేరొకరికి అమ్మేసుకుని సొమ్ము చేసుకుంటారని అన్నారు. ఈ వ్యాఖ్యలను జేసీ చేస్తున్నంతసేపు అక్కడే కూర్చున్న నాయకులు కానీ, నారాయణ కానీ ఏమీ మాట్లాడలేకపోయారు. కానీ జేసీ చెప్పదలచుకున్నది చెప్పేసి అక్కడి నుంచి చెక్కేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హాస్టల్ విద్యార్థులకు సన్నబియ్యం అంశం పరిశీలిస్తా... మంత్రి నక్కా ఆనంద్