Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

హాస్టల్ విద్యార్థులకు సన్నబియ్యం అంశం పరిశీలిస్తా... మంత్రి నక్కా ఆనంద్

అమరావతి: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావించి అమరావతిలో నిర్మించే బాబా సాహేబ్ అంబేద్కర్ స్మృతి వనానికి సంబంధించిన రూ.97.64 కోట్ల నిధులు ఏపీఐఐసీకి అప్పగించామని సాంఘీక సంక్షేమ, గిరిజన సంక్షేమ శాఖల మంత్రి నక్కా ఆనందబాబు చెప్పారు. సచివాలయంలోని 3వ బ్లాక్ లో

Advertiesment
AP minister Nakka Anandababu
, సోమవారం, 17 ఏప్రియల్ 2017 (15:13 IST)
అమరావతి: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావించి అమరావతిలో నిర్మించే బాబా సాహేబ్ అంబేద్కర్ స్మృతి వనానికి సంబంధించిన రూ.97.64 కోట్ల నిధులు ఏపీఐఐసీకి అప్పగించామని సాంఘీక సంక్షేమ, గిరిజన సంక్షేమ శాఖల మంత్రి నక్కా ఆనందబాబు చెప్పారు. సచివాలయంలోని 3వ బ్లాక్ లో తనకు కేటాయించిన కార్యాలయంలో సోమవారం ఉదయం ఆయన బాధ్యతలు స్వీకరించారు. అంతకుముందు హిందూ సాంప్రదాయబద్ధంగా పూజలు, క్రైస్తవ ఆచారం ప్రకారం ప్రార్ధనలు నిర్వహించారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. 
 
మంత్రిగా అవకాశం ఇచ్చి తన క్యాబినెట్లో స్థానం కల్పించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలిపారు. తనకు అప్పగించిన రెండు శాఖలకు సంబంధించి సంపూర్ణ అవగాన ద్వారా పేద,బడుగు, బలహీన, దళిత వర్గాలకు న్యాయం జరిగేందకు కృషిచేస్తానని చెప్పారు. తమ నేత సీఎం చంద్రబాబు లక్ష్యం మేరకు అభివృద్ధి, సంక్షేమంతోపాటు 2019 ఎన్నికలే ధ్యేయంగా పని చేస్తానన్నారు. చంద్రబాబు నాయకత్వంలో, లోకేష్ బాబు సారధ్యంలో బలహీన, బడుగు వర్గాల మద్దతు తెలుగుదేశం పార్టీకి ఉండేవిధంగా పాటుపడతానని చెప్పారు.
 
రాష్ట్రంలోని 90 సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు రూ.41.81 కోట్లు మంజూరు చేస్తూ తొలి సంతకం చేసినట్లు మంత్రి తెలిపారు. అలాగే హిందూపురం, తుని, సత్తెనపల్లిల్లో సాంఘీక సంక్షేమ పాఠశాలల నిర్మాణం నిమిత్తం రూ.63.36 కోట్ల నిధులు విడుదల చేస్తూ మరో ఫైల్ పై సంతకం చేసినట్లు తెలిపారు. బడ్జెట్ లో కేటాయించిన విధంగా అంబేద్కర్ స్మృతి వనం నిధులు ఏపీఐఐసీకి అప్పగించడం, సాంఘీక సంక్షేమ పాఠశాలలకు నిధులు మంజూరు చేయడం తన చేతులు మీదగా జరిగినందుకు సంతోషంగా ఉందని చెప్పారు. అంబేద్కర్ స్మృతి వనం ప్రాజెక్టుని త్వరగా పూర్తి చేయడానికి కృషి చేస్తానన్నారు. 
 
ఎస్టీ,ఎస్టీ ఉప ప్రణాళిక నిధులు పక్కదారి మళ్లినట్లు వచ్చిన విమర్శలపై విలేకరులు ప్రశ్నించగా అటువంటిది ఏమీ లేదని చెప్పారు. తనకు కేటాయించిన శాఖలలోని వివిధ అంశాలను పరిశీలించి, సమీక్షా సమావేశాలు నిర్వహించి ఏవైనా సమస్యలు ఉంటే పరిష్కరిస్తానన్నారు. భవిష్యత్ లో ఎవరికి కేటాయించిన నిధులు వారికే ఖర్చు చేసేవిధంగా చర్యలు తీసుకుంటానని చెప్పారు. గిరిజన పాఠశాల్లో ఉపాధ్యాయులు కొరతగా ఉన్న అంశం తన దృష్టికి కూడా వచ్చిందని, ఈ అంశాన్ని పరిశీలించి పరిష్కరిస్తానన్నారు. హాస్టల్ విద్యార్థులకు సన్నబియ్యం అన్నం పెట్టే అంశం పరిశీలిస్తానని మంత్రి ఆనందబాబు చెప్పారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కుమార్తెను ప్రేమిస్తున్నాడనీ.. యువకుడి అంగాన్ని కత్తిరించిన పాకిస్థాన్ తండ్రి