Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సొంత చెల్లి ధరించిన పసుపు చీర గురించి ఇలా మాట్లాడుతారా? షర్మిల

Advertiesment
YS Sharmila invited Chandrababu for her son's marriage

సెల్వి

, శుక్రవారం, 26 ఏప్రియల్ 2024 (17:59 IST)
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి సోదరి, రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ వై.ఎస్. షర్మిల రెడ్డి అన్నారు. పసుపు చీరను ధరించి.. టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడిని కలవడంపై ఏపీ సీఎం జగన్ చేసిన విమర్శలకు ధీటుగా సమాధానం ఇచ్చారు. సొంత చెల్లి గురించి మాట్లాడుతున్న జగన్ మోహన్ రెడ్డికి కనీస మర్యాద లోపించిందని షర్మిల అన్నారు.
 
గుంటూరులో జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రసంగిస్తూ, బహిరంగ సభలో వేలాది మంది ప్రజల ముందు తన దుస్తుల గురించి మాట్లాడినందుకు కాంగ్రెస్ నాయకురాలు షర్మిల ఆయనపై మండిపడ్డారు.
 
"నేను చంద్రబాబు (నాయుడు) ముందు మోకరిల్లిపోయాను, నేను పసుపు రంగు చీర కట్టుకున్నాను, నేను చంద్రబాబు స్క్రిప్ట్ చదువుతున్నాను. పసుపు రంగుపై చంద్రబాబుకు పేటెంట్ హక్కు ఉందా" అని కడప జిల్లా పులివెందులలో జరిగిన బహిరంగ సభలో జగన్ మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై షర్మిల తీవ్రంగా స్పందించారు. గతంలో సాక్షి ఛానల్ పసుపు రంగులో ఉండేదన్న విషయాన్ని జగన్ మోహన్ రెడ్డి మర్చిపోయారని షర్మిల అన్నారు.
 
'పసుపు శుభకరమైన రంగు అని వైఎస్‌ఆర్‌ గారే స్వయంగా చెప్పారని, పసుపు రంగు టీడీపీ సొత్తు కాదన్నారు. సాక్షికి పసుపును తానే ఎంచుకున్నారని' ఆమె గుర్తు చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బాటిల్ పైకి ఎగరేసి బాలయ్య ప్రచారం, దూసుకెళ్తున్న నట సింహం - Video