Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

జగన్ ప్రభుత్వం రెడ్ల అనుకూల ప్రభుత్వం: సయ్యద్ రఫీ

జగన్ ప్రభుత్వం రెడ్ల అనుకూల ప్రభుత్వం: సయ్యద్ రఫీ
, మంగళవారం, 23 ఫిబ్రవరి 2021 (14:39 IST)
పంచాయతీ ఎన్నికలు ముగిసి, మున్సిపల్ పోరుకు రాష్ట్రం సన్నద్ధమవుతోందని, జగన్ ప్రభుత్వంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు తీరనిఅన్యాయంజరిగిందని, ఆయావర్గాలకు చెందిన కార్పొరేషన్ల నిధులను కూడా జగన్ తనస్వప్రయోజనాలకు దారిమళ్లించాడని టీడీపీ అధికారప్రతినిధి సయ్యద్ రఫీ స్పష్టంచేశారు.

మంగళవారం ఆయన మంగళగిరిలోని పార్టీజాతీయ కార్యాల యంలో విలేకరులతో మాట్లాడారు. జగన్ చెబుతున్న నవరత్నాల న్నీ ప్రజలను మభ్యపెట్టడానికేనని, ఆయన ఆయాపథకాలపేరుతో ప్రజలకు ఇచ్చేదిపదిశాతమైతే, వారినుంచి వివిధరకాలుగా వసూలు చేస్తోంది 90శాతంవరకు ఉందన్నారు. మున్సిపల్, నగరపాలక సంస్థల్లో లబ్దిపొందడానికే అకస్మాత్తుగా జగన్ సామాజికన్యాయం జపాన్ని ఆలపిస్తున్నాడన్నారు.

గోరంత సాయంచేస్తూ, కొండంతప్రచారాన్ని జగన్ తనమీడియా ద్వారా చేసుకుంటున్నాడన్నారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నిరుద్యోగులకు, అర్హులైన యువతకు స్వయం ఉపాధి కింద జేసీబీలు, ట్రాక్టర్లు, ఇన్నోవాకార్లు, ఇవ్వడం జరిగిందన్నారు. సొంతంగా వ్యాపారం చేసుకునేవారికి సబ్సిడీపై రుణాలు కూడా అందించడం జరిగిందన్నారు.

విదేశాలకు వెళ్లి చదువకునే వివిధవ ర్గాల యువతకు రూ.10లక్షలవరకు సాయం చేయడం జరిగింద న్నారు. చంద్రబాబు ప్రభుత్వంలో విదేశాలకు వెళ్లిన విద్యార్థులు నేడు అక్కడ విద్యాభ్యాసాన్ని కొనసాగించలేక నానా అవస్థలు పడుతున్నారన్నారు. నవరత్నాల అమల్లోకూడా సవాలక్ష నిబంధ నలపేరుతో అర్హలకుకోతపెడుతున్నారన్నారు.

రూ.10వేలు, రూ.15వేలు ఇస్తున్నానంటూ, ప్రజలను మోసగిస్తూ, వివిధరకాలు గా వారిని దోపిడీచేస్తున్నాడన్నారు. వాలంటీర్ వ్యవస్థకు ప్రజాధనా న్ని దుర్వినియోగంచేస్తూ, వారిని జగన్మోహన్ రెడ్డి తనఓట్ల రాజకీయాలకు వాడుకుంటున్నాడని రఫీ మండిపడ్డారు. ఇంటింటి కీ రేషన్ పంపిణీపేరుతో, వాహానాలకొనుగోలులో కమీషన్లు కొట్టేసిన జగన్, ప్రజలను వీధుల్లో నిలుచోబెట్టడం ద్వారా ఘనచరిత్రను దక్కించుకున్నాడన్నారు.

బీసీలకు రిజర్వేషన్లలో కోతపెట్టి, 24శాతానికి తగ్గించడంద్వారా వారికిస్థానికంగా లభించే దాదాపు 16,500 పదవులను దూరంచేశాడన్నారు. ఈ విధంగా అన్నివర్గా లకు అన్నిరకాలుగా అన్యాయం చేస్తున్నజగన్, ఏవిధంగా సామా జిక న్యాయం అమలుచేశాడో ప్రతివర్గంప్రజలు ఆలోచించాలన్నారు. ముఖ్యంగా జగన్ ప్రభుత్వంలో తమకుజరిగిన అన్యాయంపై బీసీలు ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోవాలన్నారు.

జగన్ సామాజిక న్యాయం నేతిబీరలో నెయ్యి చందమే అయిందన్నారు. బీసీలకు కం టితుడుపు కార్పొరేషన్లు పెట్టి, కుర్చీలుకూడా లేకుండా చేసి, రూపాయి కూడా నిధులుఇవ్వకుండా వారిని నిలువునా వంచించా డన్నారు. కాపులకు, బీసీలకు ప్రభుత్వం అమలుచేసే అరకొర సంక్షేమపథకాలు వర్తింపచేస్తూ, అవిపొందినవారికి కార్పొరేషన్ల సాయం అందకుండా చేస్తున్నాడన్నారు. 

ఎస్సీల సంక్షేమానికి  చంద్రబాబు నాయుడి హాయాంలో రూ.8,800కోట్లవరకు విడుదల చేస్తే, జగన్ అధికారంలోకి వచ్చాక రూ.3,378కోట్లు మాత్రమే కేటాయించి, ఆ నిధులనుకూడా ఇతరపథకాలకు మళ్లించాడని రఫీ పేర్కొన్నారు. ఎస్సీ కార్పొరేషన్ సహా, మైనారిటీ, బీసీ, కాపు ఎస్టీ కార్పొరేషన్లను ఉత్సవవిగ్రహాలుగా మార్చేసిన ఘనపాఠి జగన్  ఒక్కడేనని టీడీపీనేత తేల్చిచెప్పారు. ఆయా కార్పొరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్లు గోళ్లు గిల్లుకుంటూ కూర్చున్నారన్నారు.

మైనారిటీ కార్పొరేషన్ ను నిర్వీర్యం చేసిన జగన్, దుల్హన్  పథకం కింద టీడీపీ ప్రభుత్వమిచ్చే సొమ్ముని రూ.30వేలనుంచి రూ.50వేలకు పెంచు తానని చెప్పి, మైనారిటీవర్గానికి చెందిన ఆడపిల్లలకు రూపాయి కూడా సాయం చేయలేదన్నారు. జగన్ సామాజిక న్యాయమంతా అతని కుటుంబానికే అమలవుతోందని రఫీ ఎద్దేవాచేశారు.

ఎస్టీలకు అరకొరగా నిధులు కేటాయించి,వాటిని కూడా దారిమళ్లిం చాడన్నారు. ఈబీసీ రిజర్వేషన్లను కేంద్రం అమలుచేస్తే, చంద్రబాబు  నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడుదానిలో 5శాతం రిజర్వేష న్లను కాపులకు అమలుచేస్తే, జగన్ వచ్చాక ఈబీసీ రిజర్వేషన్లను పూర్తిగా రద్దుచేశాడన్నారు.

పల్స్ సర్వే ప్రకారం, రాష్ట్రంలో రజకులు 11.63శాతముంటే, జగన్ ప్రభుత్వం కేవలం 22,347 మందికి మాత్రమే అరకొరగా సాయంచేసి చేతులుదులుపుకున్నాడన్నారు.  నాయీబ్రాహ్మణులు, దర్జీలు, మిగతా కార్మికవర్గాలు 4.8శాతముం టే, మొత్తమ్మీద 38,763 మందిని మాత్రమే ప్రభుత్వం అర్హులుగా గుర్తించిందన్నారు.

మత్స్యకారులు 15శాతముంటే, కేవలం లక్షమందికి మాత్రమే సాయం చేసినట్లు సాక్షిలో ప్రకటనలు గుప్పిం చుకున్నాడన్నారు. జగన్ అమలుచేస్తున్న సామాజికన్యాయం, వర్గాలకు చేస్తున్న సాయం అతని అవినీతిపత్రిక అయినసాక్షిలోని ప్రకటనలకు మాత్రమే పరిమితమైందని రఫీ దెప్పిపొడిచారు. ఆయా ప్రకటనల్లోకూడా భారీస్థాయిలో అవినీతి జరిగింన్నారు.

మున్సిపల్ ఎన్నికల్లో లబ్ధి పొందడానికి అన్నివర్గాలఓట్లను కొల్లగొ ట్టడానికి జగన్ మరోసారి సామాజికన్యాయం అంశాన్ని తెరపైకి తీసుకురాబోతున్నాడన్నారు. నామినేటెడ్ పదవుల్లో 712 పదవు లను రెడ్లకు కట్టబెట్టిన జగన్, సామాజికన్యాయం గురించి మాట్లాడటం విచిత్రంగా ఉందన్నారు.

ప్రతిపక్షనేతగా ఉన్నప్పుడు చంద్ర బాబు కమ్మవారికే అన్నిపదవులు ఇచ్చాడని దుష్ప్రచారంచేసిన జగన్మోహన్ రెడ్డి, 712 నామినేటెడ్ పోస్టులను తనవర్గంవారికే కట్ట బెట్టాడన్నారు. అదేవిధంగా వైస్ ఛాన్సలర్ పోస్టులు 12 ఉంటే, పది పోస్టులను రెడ్డివర్గానికే అప్పగించేశాడన్నారు.

టీటీడీ బోర్డులో 36 మంది డైరెక్టర్లుంటే, 33శాతం తనవర్గానికే ఇచ్చుకున్నాడన్నారు. ప్రభుత్వసలహాదారుల్లో 18మందిని, విప్ పదవుల్లో నాలిగింటిని, ప్రభుత్వ న్యాయవాదులు, యూనివర్శిటీ వీసీలు, సెర్చ్ కమిటీలలో జగన్  రెడ్లకే అగ్రపీఠం వేశాడన్నారు. గతప్రభుత్వపాలనపై వేసిన విచారణకమిటీలో 9మంది సభ్యులుంటే, 6స్థానాలు రెడ్లకు అప్పగించాడన్నారు.

వైద్యఆరోగ్యశాఖలో 5స్థానాల్లో మూడుస్థానాలు, ఉన్న తస్థాయి సంప్రదింపుల కమిటీలో 6పదవులుంటే, 4గురు రెడ్లే  ఉన్నారన్నారు. వ్యవసాయ మిషన్  లో 6 పదవుల్లో మూడు రెడ్లకు, ప్రైవేటీ యూనివర్శీటీ ప్రతిపాదన కమిటీల్లో 5పదవులకు గాను రెండుస్థానాలు రెడ్లకే అప్పగించాడన్నారు. మొత్తంగా చూస్తే జగన్ ప్రభుత్వంలో వివిధపదవుల్లో 85శాతంవరకు రెడ్లపెత్తనమే సాగుతోందని రఫీ వెల్లడించారు.

తనవర్గాన్ని అందలంఎక్కించిన జగన్, ఓట్లవిషయానికి వచ్చేసరికి సామాజికన్యాయం పేరుతో నాటకాలు ఆడుతున్నాడన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ లకు అడుగడుగునా తీవ్రంగా అన్యాయం చేస్తున్న జగన్మోహన్ రెడ్డి, ఏ ముఖం పెట్టుకొని వారిని ఓట్లు అడుగుతున్నాడన్నారు. మాట తప్పడం, మడమతిప్పడం జగన్ కు అలవాటుగా మారిందన్న టీడీపీ నేత, ప్రతి విషయంలో జగన్ అబద్ధాలతో ప్రజలను మోసగిం చడానికే ప్రాధాన్యత ఇస్తున్నాడన్నారు.

జగన్ తన రెండేళ్ల పాలన లో ఎంతవరకు సామాజిక న్యాయం అమలుచేశాడో, ఆధారాలతో సహా నిరూపించడానికి టీడీపీ సిధ్ధంగా ఉందన్నారు. రాష్ట్రంలో నడుస్తున్నది రెడ్ల అనుకూలప్రభుత్వమని, రెడ్లు పాలకులుగా మారితే, మిగిలినవర్గాల మంత్రులంతా ఉత్సవవిగ్రహాలుగా మారి పోయారన్నారు. జగన్ పంచే పప్పుబెల్లాల్లో కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు అన్యాయమే జరుగుతోందన్నారు.

ఆఖరికి పింఛన్లు, రేషన్ కార్డుల్లో కూడా ఆయావర్గాలవారికి తీరని జగన్ తీరని అన్యాయం చేస్తున్నాడన్నారు. జగన్ ప్రభుత్వంలో దారుణం గా దగాపడిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలు రాబోయే మున్సి పల్, నగరపాలకఎన్నికల్లో వైసీపీప్రభుత్వానికి తగినవిధంగా బుద్ధిచెప్పాలని రఫీ పిలుపునిచ్చారు. నిరుద్యోగాన్ని తగ్గించడానికి, యువతకు ఉపాధి కల్పించడానికి జగన్ ఒక్కపరిశ్రమను కూడా తీసుకురాకపోగా, టీడీపీప్రభుత్వంలో ఇచ్చిన నిరుద్యోగభృతిని కూడా  నిలిపివేశాడన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

క‌ల్యాణ‌మ‌స్తు, శ్రీ‌నివాస క‌ల్యాణాల్లో శ్రీ‌వారి సేవ‌కులు సేవ‌లందించాలి :టిటిడి అద‌న‌పు ఈవో ఎవి.ధ‌ర్మారెడ్డి