అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం మంత్రి పదవిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేబినెట్ పునర్వ్యవస్థీకరణపై మీడియాతో మాట్లాడిన ఆయన.. తానెప్పుడూ పదవులను ఆశించలేదని తెలిపారు.
సీఎం జగన్‌కు తాను సమస్య కాకూడదన్న ఆయన ఏ పని అప్పగించినా చేయటానికి నేను సిద్ధమని స్పష్టం చేశారు. మంత్రి పదవులు రాని వాళ్లకు కొంత బాధ ఉంటుందనేది వాస్తవమన్నారు.
కొత్త కేబినెట్ కూర్పు బాగుందన్న తమ్మినేని సీతారాం.., అన్ని వర్గాల దామాషా పద్ధతితో మంత్రి పదవులు కేటాయించారని అభిప్రాయపడ్డారు. మాట్లాడేవాళ్లు, చర్చించే వాళ్లు వెళ్లి వాస్తవాలు తెలుసుకోవాలని హితవుపలికారు.
తనకు మంత్రిపదవి వస్తుందని పత్రికలు రాసినా తాను మాత్రం ఆశలు పెట్టుకోలేదని తమ్మినేని సీతారాం అన్నారు. వెనుబడిన వర్గాల వారికి వెనుకబాటుతనం లేదనే ధైర్యం జగన్ కల్పించారన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల విజయాలు చూశామని.., రేపు ఎమ్మెల్యే ఎన్నికలలో కూడా విజయాన్ని ప్రజలే చూస్తారని జోస్యం చెప్పారు.