Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అన్నం పెట్టే అమరావతి రైతులకు అన్యాయం: నారా లోకేశ్ ఆగ్రహం

Advertiesment
Injustice
, శనివారం, 31 అక్టోబరు 2020 (17:53 IST)
ఏపీలోఅమరావతి రాజధాని ఆందోళనల నేపథ్యంలో టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ రాజధాని ఉద్యమంలో మహిళలు గాయపడిన వీడియోను పోస్ట్ చేస్తూ దానిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్నం పెట్టే భూములు ఇచ్చిన అమరావతి రైతులకు అన్యాయం చేశారని మండిపడ్డారు.
 
అన్నదాత త్యాగాలను సమాధి చేసే కుట్ర పన్నారని విమర్శించారు. ఐదు కోట్ల ఆంధ్రుల రాజధాని కల సాకారం చేసిన వారి రక్తం కళ్లజాస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
 
మహిళలపై కొనసాగిస్తున్న ఉద్రిక్తలు, హింసాత్మక చర్యలకు చరమగీతం పాడే మహోద్యమం ఇదని తెలిపారు. మీ లాఠీలు, తుపాకులు, నిర్బంధాలను ఎదిరించి మా వీర వనితలు మీ పతనాన్ని శాసిస్తారని, త్వరలో అమరావతిని ప్రజా రాజధాని శాశ్వతం చేస్తామని ఆయన స్పష్టం చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జాతీయ విద్యావిధానం 2020- భారత్‌లో ఉన్నత విద్యా సంస్థల కోసం నూతన సృష్టి