బీజేపీ కంటే శక్తి వంతమైన ఇందిరా గాంధీని సైతం ఒప్పించి స్టీల్ ప్లాంట్ సాధించుకున్నామంటూ మంత్రి అవంతి శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్‌రెడ్డి సెటైర్ విసిరారు.
ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ...సొంత గూటికి చేరే తాపత్రయంలో వైసీపీ..!ఇందిరా గాంధీగారు మోదీ గారి కంటే 100 రెట్లు బలమైన నాయకురాలు అంటా?-మంత్రి అవంతి శ్రీనివాస్ గారు.
నిజమే...!నాడు..!దేశంలో ప్రత్యక్షంగా ఎమర్జెన్సీ పెట్టింది.నేడు..!ఆంధ్రాలో మీ వైసీపీ ప్రభుత్వ పాలన పరోక్షంగా ఎమర్జెన్సీని తలపిస్తోంది...!అయినా మీరు అలాగే పోల్చుకుంటారు అంటూ విష్ణువర్ధన్‌రెడ్డి ట్వీట్ చేశారు.